ఆంధ్ర ప్రదేశ్

తెలుగుదేశం అనే పార్టీ ఇకపై ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండదు : సీఎం

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఈ తెలుగుదేశం అనే పార్టీ ప్రతిపక్షంలో ఉండే పరిస్థితి రాదు అని ధీమా వ్యక్తం చేశారు. తాజాగా పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్న సీఎం ఈ సుదీర్ఘకాలం మనమే అధికారంలోనే కొనసాగుతాము అని నాయకులతోపాటు కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఏ ప్రభుత్వమైనా అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధితో పాటు ప్రజల సమస్యలు కూడా తీర్చుతూ ముందుకు వెళుతూ ఉంటే ఎందుకు ఓడిపోతుంది అని ప్రశ్నించారు. ప్రతి ఒక్క కార్యకర్త కోసం సమయం కేటాయించాలి అని ముఖ్య నేతలకు సీఎం చంద్రబాబు సూచించారు. ఇప్పటినుంచి ప్రతి వారం కూడా నేను ఒకరోజు, మంత్రి లోకేష్ ఒకరోజు టీడీపీ ఆఫీసులో ప్రజలకు అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. గత వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకవైపు అభివృద్ధిని కూలగొట్టడమే కాకుండా ప్రజల సమస్యలను కూడా తీర్చలేదు అని మండిపడ్డారు. అధికారంలో ఉన్నాం కదా అని వ్యవస్థలన్నిటినీ కూడా నాశనం చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకువెళుతూ ప్రజలకు కావలసినటువంటి అవసరాలను తీరుస్తూ.. రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని తెలిపారు. కాబట్టి ప్రతి నియోజకవర్గపు ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తీర్చాలి అని సూచించారు. ప్రజల సమస్యలు మన సమస్యలుగా భావించి ముందుకు వెళితేనే ఏ సమస్యలైనా తీరుతాయని నాయకులకు సూచించారు.

Read also : అధికారులకు సీఎం సెల్యూట్.. మీ వల్లే ఇది సాధ్యం : సీఎం చంద్రబాబు

Read also : బిగ్ బ్రేకింగ్ న్యూస్… శ్రీకాకుళంలో భారీ తొక్కిసలాట..9 మందికి చేరిన మృతుల సంఖ్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button