క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- టీమిండియా క్రికెట్ జట్టులో మన తెలుగు కుర్రోళ్ల పేర్లు మామూలుగా వినిపించట్లేదు. ఒకప్పుడు భారత క్రికెట్ జట్టు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఒక్కరూ లేదా ఇద్దరు తెలుగు వాళ్ళు మాత్రమే. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎక్కడ చూసినా మన తెలుగు బిడ్డలే కనపడుతున్నారు. తాజాగా టీమిండియా క్రికెట్ జట్టులో మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 5 మంది ప్లేయర్లు ఉన్నారు. వారు కేవలం టీమిండియాలో ఒకరిగా ఉండడమే కాకుండా వారి ఆటతో మన రెండు తెలుగు రాష్ట్రాలను ఇండియాలో పై స్థాయిలో నిలబెట్టారు.
ముంబై ని షేక్ చేసిన అభిషేక్ శర్మ!… సిక్సర్లతో సెంచరీ?
మన ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి మహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, గొంగడి త్రిష వీళ్ళందరూ కూడా టీమిండియా క్రికెట్ జట్టులో సత్తా చాటుతున్నారు. ఎప్పటికప్పుడు వచ్చినా అవకాశాలు వినియోగించుకుంటూ జాతీయ జట్టులో ప్రాధాన్యతను దక్కించుకున్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పటి లాగానే వాళ్ళ ఆటతీరుతో మరింత కొనసాగితే మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దేశమంతట ఎక్కువమంది ప్లేయర్లు తయారవుతారు. కాబట్టి ఇండియా జట్టులో ఇకపై తెలుగువారు ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరి ఆట పట్ల ఇప్పటికే కోచ్లు అలాగే తోటి ప్లేయర్లు అందరూ కూడా శభాష్ అని మెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళందరూ కూడా ఇలానే ఆడుతూ టీమ్ ఇండియాలో గొప్ప స్థాయికి ఎదగాలని తెలుగు ప్రజలందరూ కూడా కామెంట్లు చేస్తున్నారు.