
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- అతి తక్కువ సమయంలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ప్రపంచ స్థాయి క్రికెట్ లో తెలుగుజాతి గౌరవాన్ని నిలబెట్టాడు. తన అద్భుతమైన ఆట తీరుతో టీమిండియాలో చోటు సంపాదించుకున్నాడు. తక్కువ సమయంలోనే ఇంటర్నేషనల్ లెవెల్ లో క్రికెట్లో రాణించారు. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా కాలికి కట్టుతో… “త్వరగా కోలుకుంటున్నాను” అనే క్యాప్షన్ ఇచ్చి ఇమేజ్ ను ఇంస్టాగ్రామ్ స్టోరీ పెట్టారు. ఈ ఫోటోను చూసిన అభిమానులు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి వెంటనే కోలుకుని తిరిగి క్రికెట్ లో ఉన్నత స్థాయికి ఎదగాలి అని కోరుకుంటున్నారు.
Read also : భారత్‌పై ట్రంప్ టారిఫ్‌ల ఎఫెక్ట్
సోషల్ మీడియా వేదికగా త్వరగా కోలుకోవాలి అని కామెంట్లు కూడా చేస్తున్నారు. కాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా నాలుగవ టెస్ట్ మ్యాచ్ కు ముందు జిమ్ లో కసరత్తులు చేస్తూ ఉండగా మోకాలికి గాయమయ్యింది. దీంతో ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ మొత్తానికి కూడా నితీష్ కుమార్ రెడ్డి దూరమవడం జరిగింది. ఆ తరువాత స్వదేశానికి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ త్వరగా కోలుకుంటున్నారు. తాజాగా తన మోకాలి గాయం గురించి అప్డేట్ ఇవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా త్వరగా కోలుకొని మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెట్టాలని కోరుకుంటున్నారు. నితీష్ కుమార్ రెడ్డి గతంలో ఆస్ట్రేలియా పై ఆడిన టెస్ట్ మ్యాచ్ లో ఆల్ రౌండర్ ప్రతిభ కనబరిచారు. ఒకవైపు బ్యాటింగ్ తో సెంచరీ, మరోవైపు బౌలింగ్ తోను అద్భుతమైన ప్రదర్శన చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలనే కాకుండా యావత్ భారత దేశం అభిమానులు అందరూ కూడా అతని దాసోహం అయ్యారు. సచిన్ టెండూల్కర్, కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి కెప్టెన్లతో పాటుగా, ఎంతోమంది కోచ్ల చేత కూడా శబాష్ అనిపించుకున్నాడు.
Read also : అల్లు అర్జున్ ని ఆ హిట్ సినిమా నుంచి తీసేసారా..?