తెలంగాణ

గ్రామస్థాయి రెవెన్యూ అధికారి (వీఎల్‌వో) పోస్టులకు దరఖాస్తుల వెల్లువ..

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారులను మళ్లీ నియామించేందుకు రేవంత్‌ సర్కార్ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా గ్రామస్థాయి అధికారుల (వీఎల్‌వో) పోస్టులకు ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. అయితే ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 వేల దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటితోపాటు సర్వేయర్ల పోస్టులకు 2,625 దరఖాస్తులు దాఖలైనట్లు తెలుస్తుంది. గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే కార్యచరణ రూపొందించింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 10,911 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. వాటిల్లో ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించనుంది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక వీఎల్‌వోను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. వీటి భర్తీలో భాగంగా గతంలో వీఆర్వో, వీఆర్‌ఏలుగా పనిచేసిన వారి నుంచి ఉన్నతాధికారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించారు.

Read Also : ఎక్సైజ్ కానిస్టేబుల్ తో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రాసలీలలు..!

గత శనివారంతో గడువు ముగిసింది. మరోవైపు 1000 మంది సర్వేయర్ల నియామకానికీ అర్హుల నుంచి దరఖాస్తులు కోరగా… ఈ పోస్టులకు కూడా భారీగానే దరఖాస్తు అందాయి. ఈ రెండు పోస్టులకు డిగ్రీ, ఇంటర్‌తోపాటు ఇతర విద్యార్హతలు ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చిన దరఖాస్తుల్లో వీఎల్‌వో, సర్వేయర్‌ పోస్టులకు అర్హులను గుర్తించి ప్రభుత్వానికి నివేదికను పంపాలని రెవెన్యూ శాఖ నిర్ణయించినట్లు సమాచారం. కాగా బీఆర్‌ఎస్‌ పాలనలో గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. వీఆర్వోలను జూనియర్‌ అసిస్టెంట్లుగా, వీఆర్‌ఏలను జూనియర్‌ అసిస్టెంట్‌ నుంచి అటెండర్‌ వరకు వివిధ పోస్టుల్లో సర్దుబాటు చేసింది. అయితే ఈ ప్రక్రియలో తమ సీనియారిటీని పట్టించుకోలేదని కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగా నియమించనున్న వీఎల్‌వో పోస్టులకు.. అందిన దరఖాస్తుల్లో సుదీర్ఘ అనుభవమున్న వారికి తొలి ప్రాధాన్యం ఇచ్చి వీఎల్‌వోలుగా నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి : 

  1. కేటీఆర్ జైలుకైనా!హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్‌లో టెన్షన్
  2. ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు
  3. తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం.. రేపు రాత్రి ఉచిత రవాణా సదుపాయం
  4. శుభవార్త అందించిన టీటీడీ బోర్డు.. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు అనుమతి
  5. మద్యం ప్రియులకు పండగే.. పండగ… వైన్స్‌ షాపులు, బార్‌ల సమయ వేళలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button