HomeతెలంగాణTelangana Politics: ఒకవైపు రేవంత్.. మరోవైపు కవిత.. మధ్యలో హరీష్ రావు!

Telangana Politics: ఒకవైపు రేవంత్.. మరోవైపు కవిత.. మధ్యలో హరీష్ రావు!

* ట్రబుల్స్ లో ట్రబుల్ షూటర్

* సిద్దిపేట పై వైరిపక్షాల గురి

* కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిస్తే మంత్రిని చేస్తానన్న రేవంత్

* కెసిఆర్ వారసురాలిగా నియోజకవర్గాన్ని అందిపుచ్చుకునే పనిలో కవిత 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: గులాబీ పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావు కలవర పడుతున్నారా? సీఎం రేవంత్ ప్రకటనతో ఆయనలో కలవరం మొదలైందా? మరోవైపు కవిత వెంటాడుతున్నారా? వచ్చే ఎన్నికల్లో ఆమె సిద్దిపేట నుంచి పోటీ చేస్తారా? డీ లిమిటేషన్ లో సిద్దిపేట మహిళలకు రిజర్వ్ అవుతుందా? హరీష్ రావు ఆ నియోజకవర్గాన్ని వదులుకోక తప్పదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి.

సిద్దిపేట పై రేవంత్ ఫోకస్..

ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించారు. దశాబ్దాలుగా ఒకే కుటుంబానికి అవకాశం ఇచ్చారని.. కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని చేస్తానని ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. అయితే ఇది హరీష్ రావు లో కలవరపెట్టే అంశం. అందుకే ఆయన సైలెంట్ గా ఉండకుండా ఎదురుదాడి మొదలుపెట్టారు. ఎవరో పోటీ చేయడం ఏంటి? నువ్వే పోటీ చేయవచ్చు కదా అని రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. తద్వారా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బిగిస్తుందని హరీష్ రావు అనుమానిస్తున్నారు.

కొత్తగా కవిత రూపంలో ప్రత్యర్థి..

మరోవైపు హరీష్ రావుకు కేవలం బయట రాజకీయ శత్రువులే కాదు. ఇంట్లో ఉన్న శత్రువులు కూడా ఇరకాటంలో పెడుతున్నారు. శ్రీరామనవమి నాడు తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కొత్త పార్టీ ప్రకటించనున్నారు కవిత. తన రాజకీయ ప్రస్థానాన్ని సిద్దిపేటను వేదికగా ఎంచుకోవాలని చూడడం చూస్తుంటే మాత్రం హరీష్ రావుకు ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. సిద్దిపేట కెసిఆర్ రాజకీయ జన్మస్థలం. అందుకే ఆ వారసత్వం హక్కు తనకే ఉందని కవిత భావిస్తున్నారు. ఆమె గానీ అక్కడ పోటీ చేస్తే గులాబీ పార్టీ క్యాడర్ రెండుగా చీలడం ఖాయం. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పోటీ చేస్తే అధికార కాంగ్రెస్ పార్టీకి అంతిమంగా లాభం చేకూరుతుంది. అందుకే హరీష్ రావు సైతం భయపడుతున్నట్లు తెలుస్తోంది.

మహిళా రిజర్వేషన్..

నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం అయింది. మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే సిద్ధిపేట వంటి కీలక స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది. అదే జరిగితే హరీష్ రావు తన సొంత నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. దీనిని ఒక టర్నింగ్ పాయింట్ గా కవిత భావించే అవకాశం ఉంది. ఒకవేళ సిద్దిపేట మహిళా కోటాలోకి వెళ్తే తెలంగాణ ఆడబిడ్డగా అక్కడ కవిత పోటీ చేయడం అత్యంత సులభం కూడా. ఆమెకు అన్ని రకాల సమీకరణలు కలిసి వస్తాయి. తద్వారా కెసిఆర్ వారసత్వాన్ని సిద్దిపేటలో ఆమె అందుకోగలరు. దీంతో హరీష్ రావు పొలిటికల్ కెరీర్ కు ఒక రకమైన బ్రేక్ వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు రేవంత్.. మరోవైపు కవిత దెబ్బకు హరీష్ రావు విలవిలలాడిపోతున్నారు. పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన ఆయన.. ఇప్పుడు ట్రబుల్స్ లో పడ్డారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments