
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా అధికారం సాధించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే తనదైన పాలన సాగిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుందని రేవంత్ విమర్శించారు. చివరకు రాష్ట్ర పేరను కూడా మార్చేశారని ఫైరయ్యారు. ఉద్దేశపూర్వకంగా TRS పేరు కలిసేలా TS అనే పేరు పెట్టారని ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర అధికారిక పేరుగా ఉన్న తెలంగాణ స్టేట్‌ను కేవలం తెలంగాణగా మారుస్తూ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
Read Also : తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు… సంక్రాంతి తర్వాత నియామకం!!!
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న TG స్థానంలో TS పేరును తీసుకొచ్చారన్నారు. ఈ మేరకు ఉద్యమ సమయంలో ఉన్న TG పేరును తిరిగి ఏర్పాటు తీసుకొచ్చారు. ప్రభుత్వ సంస్థలకు TG పేరును చేర్చారు. ప్రభుత్వ కార్యాలయాలు తమ శాఖలకు ముందు ఉన్న టీఎస్(TS) పేరును తొలగించి, టీజీ(TG)గా మార్పులు చేశారు. వాహన రిజిస్ట్రేషన్లను కూడా టీజీ పేరుతో చేస్తున్నారు. కొత్తగా వాహనాలు రిజిస్ట్రేషన్ టీజీ పేరుతోనూ చేయాల్సి ఉంటుందని ఆదేశాలు ఇచ్చారు. ఇష్టమైతే పాత వాహనాలు కూడా టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు తెలంగాణ పోలీస్ శాఖ కొత్త లోగోను డిజైన్ చేసింది.
Also Read : ఎమ్మెల్సీగా నెల్లికంటి సత్యం! సీపీఐకి ఒక సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ
ఈ మేరకు పోలీస్ శాఖ లోగోను విడుదలచేసింది. తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్ ట్విట్టర్ ఖాతాలో న్యూ లోగోను పోస్ట్ చేసింది. గత లోగోలో ఉన్న తెలంగాణ స్టేట్ పోలీస్ (Telangana State Police) తొలగించి.. తెలంగాణ పోలీస్ అనే పేరుతో కొత్త లోగోను డిజైన్ చేశారు. గత లోగోలో కేవలం స్టేట్ అనే పదాన్ని తొలగించి కొత్త చిహ్నాన్ని ఆవిష్కరించింది. ఆ ఒక్క మార్పు మినహా.. గతంలో ఉన్న లోగోనే విడుదల చేసింది. ఇక నుంచి పోలీస్ శాఖ అధికారిక చిహ్నం తెలంగాణ స్టేట్ పోలీస్ నుంచి తెలంగాణ పోలీస్ గా మారిందని పోలీసు శాఖ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి :
- రైతు భరోసా ఇప్పట్లో లేనట్లే! మళ్లీ ఆన్ లైన్ అప్లికేషన్స్ అట..
- శభాష్ కోమటిరెడ్డి.. రేవంత్ ఫోన్ తో ఉప్పొంగిన వెంకట్ రెడ్డి
- మై డియర్ రెడ్డి.. పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్
- అక్కినేనిని పొగిడి.. ఎన్టీఆర్ పేరెత్తని ప్రధాని మోడీ!
- అదే బోరుబావిలో కలెక్టర్ పిల్లలు పడితే నిర్లక్ష్యం చేస్తారా?