తెలంగాణ

మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. తేదీలు ఖరారు!

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో ఎన్నికల సంఘం కావాల్సిన సామాగ్రిని సిద్ధం చేస్తోంది.గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైన పనులను ముందుస్తుగా చేసి పెట్టుకుంటోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలుస్తోంది. గతంలోనూ మూడు విడతల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఒక్కో జిల్లాలోని గ్రామాలను మూడుగా విభజించి మూడు విడతలుగా పోలింగ్ నిర్వహించనున్నారు. సంక్రాంతి తర్వాత షెడ్యూల్ ఇచ్చి.. జనవరి నాలుగోవారంలో మొదలు పెట్టి ఫిబ్రవరి మొదటి వారంలోగా పంచాయతీ ఎన్నికలు ముగించేందుకు కార్యాచరణ రెడీ చేశారని సమాచారం.

సర్పంచ్‌కు గరిష్టంగా 30 గుర్తులను, వార్డు సభ్యులకు గరిష్టంగా 20 గుర్తులను ముద్రించారు. వీటితో పాటుగా రెండింటి మీద నోటా గుర్తును కూడా ముద్రించారు.సర్పంచ్ అభ్యర్థికి మొదటి గుర్తు ఉంగరం, రెండో గుర్తు కత్తెర, ఆ తర్వాత బ్యాట్, ఫుట్‌​బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, ​టూత్‌​ పేస్టు, స్పానర్, చెత్త డబ్బా, బ్లాక్​ బోర్డు, బెండకాయ, కొబ్బరి తోట, వజ్రం, బకెట్​లు ఉంటాయి. మొత్తం 30 మంది అభ్యర్థులకు సరిపోయేలా బ్యాలెట్‌ ​పేపర్‌ను ముద్రించారు.

బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించే ఎన్నికలకు బ్యాలెట్​‌ బాక్సులను సిద్ధం చేశారు. వీటిని ఆయా జిల్లాకేంద్రాల్లో భద్రపరుస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్​ రిలీజ్ అవుతుండటంతో….ఆయా మండలాలకు వీటిని పంపిణీ చేస్తారు. అక్కడ స్థానికంగా పోటీ చేసే అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా వీటిని వినియోగిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1తో సర్పంచు​ల పదవీ కాలం ముగియగా, జూలై 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం ముగిసింది. ప్రజాప్రతినిధుల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button