క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: తెలంగాణలో 117 మున్సిపాలిటీలు మరియు 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2026 ప్రారంభంలో తెలంగాణ రాష్ట్రాల్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి “ఇద్దరు పిల్లల నిబంధనను” (Two-child norm) రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం చట్ట సవరణ చేసింది అని తెలుస్తుంది.
బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. ఈసారి ఎన్నికలను ఈవీఎంలకు (EVM) బదులుగా బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ముఖ్యమైన తేదీలు:
జనవరి 1, 2026న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది.
జనవరి 10, 2026: ఓటర్ల తుది జాబితా ప్రచురణ.
జనవరి 11 లేదా 20: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
ఫిబ్రవరి 2026: ఈ నెలలోనే పోలింగ్ నిర్వహించి ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికలు మే 2026లో జరిగే అవకాశం ఉంది.





