క్రైమ్తెలంగాణ

ఫ్యామిలీస్ ఏరియానీ… పనికిమాలిన ఏరియాగా మార్చేశారు!.. ఏంటి ఈ ఘోరాలు?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో ఉన్నటువంటి KPHB ఏరియాలో సెక్స్ వర్కర్ల దందాలు నడుస్తున్నాయి. ఒకప్పుడు ఎక్కువగా ఫ్యామిలీస్ ఏరియా గా పేరుపొందిన కూకట్ పల్లి ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సాయంత్రం 6:00 అయితే చాలు కెపిహెచ్బి లోని మెట్రో దగ్గర సెక్స్ వర్కర్ల దందా నడుస్తోంది. వీళ్ళ కారణంగా కూకట్పల్లి ఏరియా అంతటికీ చెడ్డ పేరు వస్తుంది. ఈ కేపీహెచ్బీ మెట్రో దగ్గర జరిగే ఈ దందాలు గురించి ప్రతి ఒక్కరూ తెలుసు కానీ అందరూ సైలెంట్ గా ఉంటున్నారు. ఆ ఏరియాలో జరిగే దందాల గురించి పోలీసులకు కూడా తెలుసు కానీ ఈ వ్యవహారాన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు.

గచ్చిబౌలిలో అమెరికా గంజాయి పట్టివేత

కూకట్ పల్లి అనే ఏరియా హైదరాబాద్ సిటీకి సెంటర్లో ఉండడమే కాకుండా ఐటి జీవితాలకు దగ్గరలో సాంప్రదాయం ఉట్టిపడేలా ఉన్నట్లుగా ఉంటుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చి చాలామంది తెలంగాణలోనీ ఈ కెపిహెచ్బి కాలనీలోని స్థిరపడ్డారు. కానీ ప్రస్తుతం ఆ ఏరియా రెడ్ లైట్ ఏరియా గా మారిపోయింది. దీంతో అక్కడున్నటువంటి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గంటకింత… రాత్రికి అంతా.. రోజుకు అయితే ఎంత?.. అని అనుకుంటూ చాలామంది మెట్రో దగ్గర మితిమీరిపోతున్నారు. రాత్రి అయిందంటే చాలు ఈ సెక్స్ వర్కర్ల దందా కారణంగా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ జరుగుతున్న దందాల గురించి పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పూర్తిస్థాయిలో చర్యలు మాత్రం తీసుకోవడం లేదు.

రఘురామకృష్ణరాజుకు షాక్!… సుప్రీంకోర్టు నుండి జగన్ కు భారీ ఊరట?

ఒకవేళ పోలీసులు వార్నింగ్ ఇచ్చినా కూడా రెండు లేదా మూడు రోజులు సైలెంట్ గా ఉండి మళ్ళీ ఇదే దందాను మొదలు పెడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ దందాల వల్ల స్థానిక ప్రజలతో పాటు మహిళలు ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన చెందుతున్నారు. మరి ఇంతలా ప్రజలు వేడుకుంటున్నా ఈ దందాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు వేచి ఉండాల్సిందే.

దేశంలో తొలిసారి బిచ్చగాడు అరెస్ట్?

Back to top button