తెలంగాణ

35 లక్షల ఎకరాలకు రైతు భరోసా కట్? కొత్త రూల్స్ ఇవే..

రైతు భరోసాపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై రైతు భరోసా విధివిధానాలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కేబినెట్ సబ్ కమిటిలోని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు దాదాపు రెండు గంటల పాటు రైతు భరోసా పథకానికి మార్గదర్శకాలు ఖరారు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఈ ప్రతిపాదనలు అందించనున్నారు. శనివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసా కొత్త మార్గదర్శకాలు ఫైనల్ చేసి అధికారికంగా ప్రకటించనున్నారు.

జనవరి 14 నుంచి రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అయితే గతంలో ఇచ్చినట్లుగా రైతులందరికి కాకుండా పంట పండించే రైతులకు మాత్రమే భరోసా ఇవ్వాలని మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయం తీసుకుందని సమాచారం. ఈ మేరకు రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 5 నుంచి 7 వరకు డిక్లరేషన్ తీసుకోనున్నారు. గూగుల్ మ్యాపింగ్‌ ద్వారా సాగు భూమిని గుర్తించనున్నారు. ఆ లెక్కలు తేలాకా సాగుభూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తారని తెలుస్తోంది.

ధరణి లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం భూమి కోటి 53 లక్షల ఎకరాలు ఉన్నట్లు తెలుస్తోంది.ఇందులో కోటి 20 లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ లెక్కన దాదాపు 35 లక్షల ఎకరాల భూమికి రైతు భరోసా రాదని అంచనా వేస్తున్నారు. అంటే రాష్ట్రంలో రైతు బంధు వచ్చిన రైతులు దాదాపు 65 లక్షల మంది ఉండగా.. అందులో 15 నుంచి 20 లక్షల మందికి రైతు భరోసా రాకపోవచ్చని అంటున్నారు. ఇక కౌలురైతుల విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button