
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయాచోట్ల నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు అని ప్రభుత్వం దృష్టికి రావడంతో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. నకిలీ విత్తనాలు అమ్మే కంపెనీలకు భారీగా జరిమానా విధించనున్నారు. నకిలీ విత్తనాలని బయటపడితే మాత్రం కచ్చితంగా ఆ కంపెనీలకు 50 వేల రూపాయల నుంచి 30 లక్షల రూపాయల వరకు ఫైన్ విధిస్తామని అంతేకాకుండా మూడేళ్ల పాటు జైలు శిక్ష, ఐదేళ్లు నిషేధం విధిస్తామని తెలిపింది. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది.
Read also : మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి మృతి..!
అంతేకాకుండా ఈ విత్తనాలు పంపిణీ చేసేటువంటి ఆ సంస్థ నిర్వాహకులు అలాగే డీలర్లు ఎవరైనా కూడా వారి విద్యార్హత అగ్రికల్చర్ డిప్లమా లేదా డిగ్రీ గా ఉండాలి అని తెలిపారు. ప్రత్యేక విత్తన రకాల నమోదు అలాగే విత్తన ధరలు నియంత్రించే అధికారం రాష్ట్రానికి ఇవ్వాలి అని ప్రభుత్వం కోరినట్లుగా సమాచారం. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర విత్తన చట్టం 2025 ముసాయిదాపై తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చింది. కాబట్టి ఇకపై విత్తన ఉత్పత్తి సంస్థ నిర్వాహకులు అలాగే డీలర్లు మరియు పంపిణీదారులు అందరూ కూడా ఈ విషయంపై జాగ్రత్త వహించాలి అని హెచ్చరించారు. ఈ మధ్యకాలంలో నకిలీ విత్తనాల కారణంగా ఎంతో మంది రైతులు నష్టపోతున్న సందర్భాలు ప్రతిరోజు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇందుమూలంగానే రైతులు విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.
Read also : Wildlife Facts: కళ్లు తెరిచి నిద్రించే జంతువులు ఏవో మీకు తెలుసా?





