ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు. అమరావతిని గ్రేట్ సిటీగా చంద్రబాబు చెబుతుండగా.. రేవంత్ మాత్రం అమరావతికి అంత సీన్ లేదని కామెంట్ చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి అమరావతిపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సీఎం రేవంత్ పై టీడీపీ కేడర్ గుర్రుమంటున్నారు.
కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు రాసిన యునిక పుస్తకావిష్కరకు హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సభలో మాట్లాడుతూ పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 35 ఏళ్ల విద్యార్థి దశ నుండి సీఎం స్థాయి వరకు ఉన్న పెద్దలను కలవడానికి ఈ వేదిక ఉపయోగపడిందన్నారు. విద్యాసాగర్ రావు అందరికి సాగర్ జీగా ఉంటారని..ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి రాజకీయం నుండి ఉమ్మడి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా,కేంద్ర మంత్రిగా పని చేశారని చెప్పారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నా విద్యాసాగర్ రావుపై ఎలాంటి ఆరోపణలు లేవన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సమాజానికి ఆదర్శ రాజకీయ నాయకుడిగా విద్యాసాగర్ రావు నిలిచారని కొనియాడారు.
విద్యార్థి దశలో చైతన్యం లేకపోవడంతోనే పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయని సీఎం రేవంత్ అన్నారు. విద్యార్థి రాజకీయాల్లో సిద్దాంత పరమైన రాజకీయాలు లోపించాయన్నారు. విద్యార్థి రాజకీయాలను తెలంగాణలో ప్రోత్సహించాలని.. విద్యార్థి రాజకీయాలు లేకపోతే చైతన్యం కోల్పోతామని చెప్పారు. రాష్ట్రంలో రెండవ తరంలో
జైపాల్ రెడ్డి,విద్యా సాగర్ రావు,దత్తాత్రేయ వున్నారని.. మూడవ తరంలో చెప్పుకోతగ్గ నేతలు లేరన్నారు.అసెంబ్లీలో సీఎంకు ఎంత సమయం మైక్ ఇస్తారో ప్రధాన ప్రతిపక్ష నేతకు అంతే సమయం మైక్ ఇస్తారని.. ప్రభుత్వం అంటే
పాలకపక్షం,ప్రతిపక్షం కలిసి ఉంటాయన్నారు.
గోదావరి జలాలు తెలంగాణకు వినియోగించుకోవాలంటే విద్యాసాగర్ రావు అనుభవం అవసరం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికలప్పుడే రాజకీయాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా.. తనకు ఎలాంటి భేషజాలు లేవని స్పష్టం చేశారు. హైదరాబాద్ విశ్వనగరంలా మారాలంటే రీజినల్ రింగ్ రోడ్డు కావాలన్నారు. తెలంగాణ ప్రపంచంతో పోటీ పడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు ఏపీ,అమరావతితో పోటీ కాదే కాదన్నారు.