క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. వాస్తవానికి రేపు, నవంబర్ 7, శుక్రవారం జరగాల్సిన సమావేశం నవంబర్ 12వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేయబడింది. జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల నేపథ్యంలో కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
Also Read:జూబ్లీహిల్స్ లో ఓడిపోతామన్న భయం లో రేవంత్ ఉన్నాడు : కేటీఆర్
నవంబర్ 11న (మంగళవారం) పోలింగ్ జరగనుండగా, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. వాయిదా పడిన ఈ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా తదుపరి కార్యాచరణ, ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Also Read:క్యాన్సర్ కారణంగా కేజీఎఫ్ లో కీలక పాత్ర పోషించిన నటుడు మృతి!
గత కేబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికల్లో పోటీకి ఉన్న ‘ఇద్దరు పిల్లల నిబంధన’ను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు, గిగ్ వర్కర్స్ బిల్లు ఆమోదం మరియు ఇతర కీలక విధానపరమైన నిర్ణయాలపై చర్చ జరగనుంది.
Also Read:మేము ఎవరికి అనుచరులం కాదు.. అది రెడ్డి అయినా?.. రావు అయినా? : అక్బరుద్దిన్





