తెలంగాణ

తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు… సంక్రాంతి తర్వాత నియామకం!!!

క్రైమ్ మిర్రర్,ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం అంశం మరోసారి తెరిపైకి వచ్చింది. సంక్రాంతి తర్వాత టీబీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం జి. కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతుండగా.. ఆయన స్థానంలో మరొకరి అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా కొనసాగుతుండటంతో పార్టీ వ్యవహారాలు చక్కబెట్టేందుకు మరికొర్ని రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా నియమించాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త అధ్యక్షుడి రేసులో పలువురు సీనియర్ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, బండి సంజయ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే వీరిలో బండి సంజయ్ గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన హయాంలోనే బీజేపీ తెలంగాణలో పుంజుకుంది.

Also Read : సీఎం రేవంత్‌కు బండి సంజయ్ డెడ్ లైన్.. ఆ తర్వాత దంచుడే!

ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల ముందు అనుహ్యంగా ఆయన్ను తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ డీలా పడినా.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటింది. 8 మంది ఎంపీలుగా విజయం సాధించారు. బండి సంజయ్ రెండోసారి గెలిచి ఆయన కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం సామాజిక అంశాల ఆధారంగా ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బలమైన బీసీ సామాజికి వర్గానికి చెందిన ఈటల రాజేందర్, ధరపురి అర్వింద్‌లతో పాటు ఓసీ వెలమ సామాజిక వర్గానికి చెందిన రఘునందన్ పేర్లను హైకమాండ్ షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలిసింది. బీసీలకు పదవి ఇవ్వాల్సి వస్తే ఈటల లేదా ధర్మపురి అర్వింద్‌లలో ఒకరికి అవకాశం దక్కొచ్చు. లేదంటే కేడర్‌లో మాస్ ఫాలోయింగ్ ఉన్న రఘునందన్ రావుకు సైతం అవకాశం ఉంటుందని సమాచారం. సంక్రాంతి తర్వాత ఈ ముగ్గురిలో ఒకరికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమైందన్న ఊహాగానాల నేపథ్యంలో రాష్ట్ర పగ్గాలు ఎవరికి దక్కుతాయనేది ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి : 

  1. శభాష్ కోమటిరెడ్డి.. రేవంత్ ఫోన్ తో ఉప్పొంగిన వెంకట్ రెడ్డి
  2. ఎమ్మెల్సీగా నెల్లికంటి సత్యం! సీపీఐకి ఒక సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ
  3. మై డియర్ రెడ్డి.. పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్
  4. రైతు భరోసా ఇప్పట్లో లేనట్లే! మళ్లీ ఆన్ లైన్ అప్లికేషన్స్ అట..
  5. అక్కినేనిని పొగిడి.. ఎన్టీఆర్ పేరెత్తని ప్రధాని మోడీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button