తెలంగాణ

తెలంగాణలో 8 కులాల పేర్ల మార్పు.. నోటిఫికేషన్‌ జారీ, కొత్త పేర్లు ప్రతిపాదన

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కులం పేర్లను ఇప్పటికీ తిట్టు పదాలుగా వాడుతున్నారు. సినిమాల్లో, రాజకీయ నేతల వాదవివాదాల్లో కొన్ని కులాల పేర్లను తిట్లుగా యధేచ్ఛగా వాడేస్తున్నారు. దీంతో ఆయా కులాల వారు ఆవేదనకు గురవుతున్నారు. తమ కులాలను అవమానిస్తున్నారని.. ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడుతున్నారు. చులకనభావంగా చూస్తూ తిట్లకు ఉపయోగిస్తున్న తమ కులాల పేర్లు మార్చాలని కొన్ని కులాల ప్రతినిధులు ఏళ్లుగా పోరాడుతున్నారు. ఈ మేరకు బీసీ కమిషన్‌కు పలు సంఘాలు విజ్ఞప్తి కూడా చేశాయి. బీసీ జాబితాలోని ఎనిమిది కులాల పేర్లు మార్చాలని, కొన్ని పర్యాయపదాలు జోడించాలని వచ్చిన ప్రతిపాదనలపై తెలంగాణ బీసీ కమిషన్ అభ్యంతరాలు కోరింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీచేసింది.

Also Read :  మోహన్ బాబు కేసులో మరో ట్విస్ట్.. సుప్రీంకోర్ట్ లో పిటిషన్ దాఖలు!!

కొన్ని పేర్లను సమాజంలో చులకనగా వినియోగిస్తున్నారని.. వాటిని మార్చాలని కమిషన్‌ నిర్వహించిన బహిరంగ విచారణలో తేలింది. బీసీ కమిషన్ కార్యాలయంలోనూ పలువురు విన్నవించారు. కుల సంఘాల ప్రతినిధులతో బీసీ కమిషన్ ఇప్పటికే ప్రాథమిక చర్చలు నిర్వహించింది. పేరు మార్పులపై ఎవరికైనా అభ్యంతరాలున్నా, ఇతర పర్యాయపదాలు ఉన్నా తెలియజేయాలని కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 18 తేదీ వరకు హైదరాబాద్‌ జలమండలి ఆవరణలోని బీసీ కమిషన్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు నమోదు చేయవచ్చని కమిషన్‌ కార్యదర్శి బాలమాయాదేవి వెల్లడించారు. వచ్చిన అభ్యంతరాలు, సూచనల ఆధారంగా ఆయా కులాల పేర్ల మార్పుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆమె వెల్లడించారు.

కులం పేరు- కొత్త పేరు
దొమ్మర (బీసీ ఏ)                                  – గాంద వంశీయ
వంశరాజ్ / పిచ్చగుంట్ల (బీసీ ఏ)         – పిచ్చగుంట్ల తొలగింపు
తమ్మలి (బ్రాహ్మణేతరులు, శూద్రులు) – బ్రాహ్మణేతర, శూద్ర పదాల తొలగింపు
రజక (చాకలి, వన్నర్)                          – వన్నర్ తొలగించి దోబి పర్యాయపదం చేర్పు
బుడబుక్కల                                        – ఆరె క్షత్రియ జోషి / శివ క్షత్రియ/ రామజోషి
కుమ్మర లేదా కులాల, శాలివాహన      – ప్రజాపతి పర్యాయ పదం చేర్పు
చిప్పోళ్లు (మేర)- మేర
వీరముష్ఠి (నెట్టికొటాల), వీరభద్రీయ    – వీరభద్రీయ

ఇవి కూడా చదవండి : 

  1. భారత్‌లో తొలి HMPV కేసు..?.. 8 నెలల చిన్నారికి సోకినట్లు నిర్ధారణ!!
  2. ప్రారంభమైన హైడ్రా గ్రీవెన్స్.. స్వయంగా ఫిర్యాదులు స్వీకరిస్తున్న కమిషనర్ రంగానాథ్
  3. హైటెన్షన్.. ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్, ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు!!
  4. వెల్‌కమ్‌ టు చర్లపల్లి రైల్వే స్టేషన్.. నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ
  5. ఘనంగా ముగిసిన హైందవ శంఖారావం!… డిమాండ్స్ ఇవే ?

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button