తెలంగాణ

డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల.. ఆయనతోనే ఆకుల అర్వింద్ కుమార్

ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు తీగల. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేలా ఏపీ సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. పాత టీడీపీ నేతలంతా తిరిగి సొంతగూటికి వచ్చేందుకు సిద్దమవుతున్నారు. చంద్రబాబు పిలుపుతో హైదరాబాద్ మాజీ మేయర్, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. డిసెంబర్ 3న వేలాది మంది అనుచరులతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు తీగల. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నగరంలో భారీ ర్యాలీకి తీగల ప్లాన్ చేస్తున్నారు.

తీగలతో పాటే వందలాది మంది కీలక నేతలు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. తీగల ప్రధాన అనుచరుడిగా ఉన్న ఆకుల అర్వింద్ కుమార్ కూడా టీడీపీలో చేరబోతున్నారు. మొదటి నుంచి తీగల అనుచరుడిగా ఉన్న ఆకుల… సమైక్య రాష్ట్రంలో టీడీపీలో పలు కీలక పదవులు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పని చేశారు. తీగలతో పాటే బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లోనూ కీలక పదవులు నిర్వహించారు. సరూర్ నగర్ డివిజన్ కు చెందిన ఆకుల అర్వింద్ కుమార్.. మహేశ్వరం నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్నారు. తన రాజకీయ గురువు తీగలతో పాటు టీడీపీలో చేరబోతున్నారు. ఆకుల చేరికతో సరూర్ నగర్ డివిజన్ లో టీడీపీ పవర్ ఫుల్ గా మారనుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

మరిన్ని వార్తలు చదవండి…

జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు

నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?

అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఆర్టీసీలో దుమారం 

ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం 

కోటి 10 లక్షల ఇండ్లలో సమగ్ర సర్వే పూర్తి

సీఎం రేవంత్ జిల్లా మరో దారుణం.. పిల్లల సాంబారు,చట్నీలో బొద్దింక

అయ్యప్ప మాలలో కడప దర్గాకు రాంచరణ్

కుర్ కూరే తినడం వల్లే పిల్లలకు అస్వస్థత.. హైకోర్టుకు సర్కార్ రిపోర్ట్

ఆర్జీవి కోసం ఏకంగా రెండు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు!

8 నెలల తర్వాత కవిత ఫవర్ ఫుల్ స్పీచ్.. సీఎం రేవంత్‌కు టెన్షన్

రేవంత్ రెడ్డికి రాహుల్ క్లాస్.. అదాని 100 కోట్లు రిటర్న్

గజగజ వణుకుతున్న జనాలు.. తెలంగాణలో చలి పంజా

పాతబస్తీలో నేను చెప్పిందే ఫైనల్.. మేయర్‌కు MIM ఎమ్మెల్యే వార్నింగ్

సీఎం రేవంత్‌కు సీపీఎం నేత తమ్మినేని వార్నింగ్

సచివాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఘోర అవమానం

రేవంత్ టచ్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. జంప్ అయ్యేది వీళ్లే..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button