
క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్ న్యూస్:- భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్నటువంటి తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘోరంగా తడబడుతుంది. మొదటి ఇన్నింగ్స్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 159 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆ తరువాత భారత్ 189 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మళ్లీ తిరిగి రెండో ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా 153 పరుగులకే ఆల్ అవుట్ కాగా రెండో ఇన్నింగ్స్ లో భారత్ గెలవాలి అంటే 124 పరుగులు చేయాల్సి ఉంది. అయితే చాలా సునాయసంగా మ్యాచ్ ను ముగిస్తారు అనుకుంటే ఆరంభంలోనే పది పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి తడబడుతుంది. రెండవ ఇన్నింగ్స్ లో జైస్వాల్ డక్ ఔట్ అవగా.. రాహుల్ 1 పరుగు చేసి ఓటయ్యారు. ప్రస్తుతం గ్రీస్ లో వాషింగ్టన్ సుందర్ మరియు దృవ్ జూరెల్ ఉన్నారు. భారత్ మొదటి టెస్టులో విజయానికి 114 పరుగులు చేయాల్సి ఉంది. మరోవైపు గిల్ గాయం కారణంగా ఆసుపత్రిలోనే ఉన్నారు అని బీసీసీఐ వెల్లడించింది. మరి మ్యాచ్ ముగిసేలోపు టీమిండియా విజయం సాధిస్తుందా లేదా టై గా ముగిస్తుందా అని ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read also : సాంకేతిక లోపానికి.. దేవుడినే నిందిస్తావా?.. రాజమౌళికి వార్నింగ్ ఇస్తున్న భక్తులు!
Read also : Farooq Abdullah: ఢిల్లీలో బాంబు దాడి.. ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు!





