Saturday, March 28, 2026
Homeక్రైమ్టెన్త్‌ విద్యార్థినితో ఉపాధ్యాయుడి రహస్య వివాహం

టెన్త్‌ విద్యార్థినితో ఉపాధ్యాయుడి రహస్య వివాహం

  • మాయమాటలు చెప్పి ప్రేమలో పడేసిన ఫిజిక్స్‌ టీచర్‌

  • 20రోజుల కింద విద్యార్థిని మెడలో పసుపుతాడు చూసిన తల్లి

  • పాఠశాల యాజమాన్యాన్ని నిలదీసిన బాలిక బంధువులు

  • నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు

టెన్త్‌ విద్యార్థినికి మాయమాటలు చెప్పి… రహస్యంగా వివాహం చేసుకున్న ఘటన మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో వెలుగు చూసింది. పోచారం డివిజన్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో పదో తరగతి చదువుతున్న బాలికకు ఫిజిక్స్‌ ఉపాద్యాయుడు మైటీన్‌ (27) మాయమాటలు చెప్పి ప్రేమలో పడేశాడు. నెలరోజుల కిందట బాలికను రహస్యంగా వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. 20రోజుల కింద బాలిక మెడలో పసుపుతాడును తల్లి గమనించింది. విద్యార్థిని గట్టిగా మందలించడంతో జరిగిన విషయం చెప్పింది. దీంతో పాఠశాల యాజమాన్యాన్ని బాలిక తల్లిదండ్రులు, బంధువులు నిలదీశారు. వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో… పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు మైటీన్‌పై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి, రిమాండ్‌కు పంపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments