
మునుగోడు,క్రైమ్ మిర్రర్ :- యు ఎస్ పి సి ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యములో జరిగే మూడు దశల పోరాట కార్యక్రమాల్లో మొదటి దశ కార్యక్రమములో బాగంగా గురువారం మునుగోడు మండల స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యములో మునుగోడు తహశీల్దార్ నరేష్ కు వినతి పత్రం అందజేశారు..జిల్లా నాయకులు కే రత్నయ్య, గేర నరసింహ పాల్గొని మాట్లాడారు.తహశీల్దార్ ల ద్వారా సీఎం కు వినతి పత్రాలు సమర్పించామన్నారు..అర్హతలేని డీ ఈ ఓ లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు..ఉపాధ్యాయుల ప్రమోషన్లు బదిలీ షెడ్యూలు ను తక్షణమే విడుదల చేయాలని ఈ నెల ఆఖరులోగా ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.అన్ని జిల్లాలకు శానిటేషన్ గ్రాంట్స్ విడుదల చేయాలన్నారు.మండల స్టీరింగ్ కమిటీ నాయకులు,కల్లూరు స్వామి పాల్గొన్నారు.
పిల్లలతో సినిమా చూడడానికి వచ్చిన మహిళలు… మొహమాటం లేకుండా వెనక్కి పంపించిన పోలీసులు?
రష్యాలో కుప్పకూలిన విమానం, 50మంది దుర్మరణం!