
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో : ఏపీ లిక్కర్ స్కామ్ వైసీపీ మెడకు చుట్టుకుంటోందని అందరూ భావిస్తున్నారు. స్కామ్ వెనుక బిగ్‌బాస్ ఎవరు…? అన్నదానిపై చర్చిస్తున్నారు. వైసీపీ హయంలో స్కామ్ జరిగిందని టీడీపీ కూడా ఆరోపణలు చేస్తోంది. అయితే… ఇప్పుడు మరో బాంబు పేలింది. లిక్కర్ స్కామ్‌లో టీడీపీ హస్తం కూడా ఉందట. ఇదేం ట్విస్ట్‌రా బాబు అనుకుంటున్నారా..! ఈ బాంబును కేశినేని నాని పేల్చారు. లిక్కర్ స్కామ్‌లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని హస్తం ఉందని.. ఏకంగా సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు కేశినేని నాని. దీంతో… ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
కేశినేని నాని ఆరోపణలతో ఇప్పుడు.. లిక్కర్ స్కామ్ యూటర్న్ తిరిగిందా..? టీడీపీ వైపు వేలెత్తి చూపిస్తోందా..? ఏమో అది అటుంచితే.. కేశినేని నాని ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవాలు ఉన్నాయో తేలాల్సి ఉంది. కేశినేని నాని – కేశినేని చిన్ని మధ్య కొన్నేళ్లుగా కోల్డ్ వార్ ఉంది. 2024 ఎన్నికల ముందు అది ముదిరిపాకాన పడింది. అప్పటి నుంచి ఒకరిపై ఒకరు బురదచల్లుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్‌లో తమ్ముడు చిన్ని పాత్ర ఉందంటూ… కేశినేని నాని లేఖ కూడా ఈ కోవకే వస్తుందా…? లేదా ఇందులో వాస్తవం ఉందా…? అన్నది తేలాల్సి ఉంది.
Also Read : అమరావతే రాజధాని… మరి వైసిపి మాటలు జనాలు ఉంటారా?
కేశినేని చిన్ని టార్గెట్‌గా విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు సోదరుడు నాని. ఇటీవల విశాఖ భూముల విషయంలోనూ చిన్నిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్‌కు కేశినేని చిన్నికి లింక్ పెడుతున్నారు. చంద్రబాబుకు రాసిన లేఖలో కేశినేని నాని ఏం చెప్పారంటే… లిక్కర్ స్కామ్‌లో రాజ్ కసిరెడ్డి, ఆయన సన్నిహితుడు దిలీప్ పైలా, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి సంబంధాలు ఉన్నాయన్నారు. కేశినేని చిన్ని-ఆయన భార్య జానకి లక్ష్మికి… ప్రైడ్ ఇన్‌ఫ్రాకాన్ ఎల్‌ఎల్‌పీలో భాగస్వామిగా ఉన్నారని చెప్పారు నాని. ఆ కంపెనీ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉందని… అక్కడే కసిరెడ్డి-దిలీప్ పైలాకు చెందిన ఈశాన్వి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ కూడా ఉందన్నారు.
Also Read : తిరుమల కొండపై తుపాకులతో సైనికుల పరుగులు
ఈ రెండు కంపెనీలు ఒకే ఈమెయిల్ ఐడీని ఉపయోగిస్తున్నారని కూడా లేఖలో పేర్కొన్నారు కేశినేని నాని. లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన కసిరెడ్డి-దిలీప్‌తో చిన్నీకి సంబంధాలు ఉండటం… ఆందోళన కలిగిస్తోందన్నారు కేశినేని నాని. కసిరెడ్డి-దిలీప్‌కు సంబంధించిన కంపెనీలో ఎంపీ చిన్ని భాగస్వామిగా కూడా ఉన్నారన్నారు. ఇవన్నీ చూస్తే… లిక్కర్ స్కామ్‌లో చిన్ని పాత్ర ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. లోతైన దర్యాప్తు చేస్తే.. అన్ని విషయాలు బయటపడతాయని చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు కేశినేని నాని. మరోవైపు.. కేశినేని నాని ఆరోపణలను తిప్పికొట్టారు ఎంపీ చిన్ని. అర్థంపర్థంలేని, నీతిమాలిన ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు ఆయన.
ఇవి కూడా చదవండి …
-
పసలేదు కేసీఆర్ ప్రసంగం ఆత్మస్తుతి, పరనింద… కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోయడానికే సభ?
-
ఏకకాలంలో ప్రేమాయణం.. ఒకే మండపంలో పెళ్లి..
-
హస్తం పార్టీలో చెంపదెబ్బలు – ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన ఎంపీ
-
ఉగ్రదాడి ఎఫెక్ట్- తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక మరింత ఆలస్యం..!
-
ఉగ్రదాడి ఎఫెక్ట్… పాకిస్తాన్ జిందాబాద్ అన్నందుకు కొట్టి చంపేశారు!.