
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- అశోక్ గజపతిరాజు అంటే ఇప్పట్లో చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఇతను ఒకప్పుడు టీడీపీ పార్టీలో కీలకంగా వ్యవహరించేవారు. టీడీపీ సీనియర్ గా చెప్పుకునే అశోక్ గజపతిరాజుకు ఇప్పుడు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. తాజాగా గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజును మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించడం జరిగింది. అశోక్ గజపతిరాజు గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కీలకంగా పని చేశారు. ప్రస్తుతం టిడిపి సీనియర్ నేతగా అలాగే కేంద్ర మాజీ మంత్రి గా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజుకు తాజాగా కేంద్రం గోవా గవర్నర్గా నియమించడంతో ప్రతి ఒక్కరూ ఇతని గురించి చర్చిస్తున్నారు. అందులోనూ టీడీపీ సీనియర్ నేత అనగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోని నాయకులు అలాగే పార్టీ అభిమానులు ఇతను ఎవరు అని చర్చిస్తున్నారు.
గోవా గవర్నర్ గా ఎంపికైన అశోక గజపతి రాజు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అశోక్ గజపతిరాజు 1951 జూన్ 26న స్వాతంత్రం వచ్చిన రెండు మూడు సంవత్సరాల తరువాత జన్మించారు. ఇతను మొట్టమొదటిసారిగా 1978లో జనతా పార్టీ తరఫున విజయనగరం స్థానం నుంచి శాసనసభకు ఎన్నిక కావడం జరిగింది. 1983, 1985, 1989, 1994, 1999, 2009లో వరుసగా విజయనగరం స్థానం నుంచి శాసనసభకు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ హయాంలో పలుమార్లు మంత్రిగాను పనిచేసిన అనుభవం ఉంది. ఇక 2014లో ఎంపీగా గెలిచి ఎన్డీఏ ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు స్వీకరించారు. దీంతో రాజకీయ అనుభవం అలాగే ఎంపీగాను ఎన్నో పనులు చేసినటువంటి అశోక్ గజపతిరాజును నేడు కేంద్రం గోవా గవర్నర్గా నియమించింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ నాయకులు అలాగే అభిమానులు అందరూ కూడా ఇతని గురించి చర్చిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.