
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఎంతోమంది టీడీపీ ఫాలోవర్స్ ట్రోల్స్ చేస్తున్న సంఘటనలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. నిన్న మీడియా సమావేశంలో డేటా సెంటర్ల గురించి ప్రస్తావిస్తూ… డేటాకు మైండ్ అప్లై చేస్తే AI అవుతుంది అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలపై కొంతమంది టీడీపీ ఫాలోవర్స్ అలాగే కార్యకర్తలు ట్రోలింగ్ చేస్తున్నారు. డేటాకు మైండ్ అప్లై చేస్తే ఎనాలిసిస్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వదు. ఏఐ లో లెర్నింగ్ ఫ్యాట్రన్స్, అల్గారిథమ్స్ వంటివి ఉంటాయి అని.. జగన్ పై ట్రోలింగ్స్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు ఏమో జగన్ చేసినటువంటి వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తుండగా.. టీడీపీ కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. AI అంటే సామాన్యులకు అర్థమయ్యేలా సులభంగా చెప్పారు జగన్ అంటూ.. జగన్ పై కౌంటర్లు వేస్తున్నారు. దీంతో వైసీపీ మరియు టీడీపీ మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతుంది. ఇప్పటికే దేశ రాజకీయాలు ఒక ఎత్తు అయితే… మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం మరో ఎత్తులా కనిపిస్తున్నాయి. ఒకవైపు వైసీపీ పార్టీ మరోవైపు కూటమి పార్టీలు ఒకరిపై ఒకరు ప్రతిరోజు కూడా దారుణంగా విమర్శలు చేసుకుంటున్నారు.
Read also : పేరెంట్స్ అనుమతిస్తే… కచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటా : అనుపమ
Read also : నేడే చివరి వన్డే… తెలుగు ప్లేయర్ అవుట్?





