తెలంగాణ

రేవంత్ మరో సంచలనం.. ట్యాక్స్,రిజిస్ట్రేషన్ చార్జీలు మాఫీ

తెలంగాణ ప్రజలకు మరో వరం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. వాహనదారులకు ఊరటనిచ్చేవా నూతన ఎలక్ట్రిక్ వాహన పాలసీని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. కొత్త పాలసీ నవంబర్ 18 నుంచి అమల్లోకి వచ్చింది. ఎలక్ట్రిక్‌ వాహనాలకు వాహనాలకు రిజిస్ట్రేషన్‌ ఫీజులో వంద శాతం మినహాయింపు ఇచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలకు రహదారి పన్ను కూడా వంద శాతం మినహాయించింది. కొత్త ఈవీ పాలసీతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులకు ఏడాదికి సుమారు లక్ష రూపాయలు మిగులుతాయని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.

రోడ్‌ ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపులివ్వడంతో ఈవీలు కొన్నవారికి ప్రయోజనం కలుగనుంది. కార్ల ధర 10 లక్షల లోపు అయితే 14శాతం, ధర 10 లక్షలపైన అయితే 17శాతం రోడ్‌ ట్యాక్స్‌ మిగులుతుంది. ఒకవేళ కొనుగోలుదారు పేరిట అప్పటికే టూవీలర్ ఉంటే 2 శాతం అదనంగా ట్యాక్స్‌ పడుతుంది. అంటే మొత్తం 19శాతం మిగులుతుంది. ఆ రకంగా ఈవీ కారు కొన్నవారికి లక్షా 40 వేల నుంచి లక్షా 90 వేల రూపాయల వరకు ఆదా కానుంది. బైకులు కొన్న ధరలో 12శాతం రోడ్‌ ట్యాక్స్‌ మిగులుతుంది. బైక్‌లు, కార్లకు రిజిస్ట్రేషన్‌ ఫీజు 15 వందల నుంచి 2వేల వరకు మిగలనుంది.
జీవో నెంబర్ 41 ద్వారా తీసుకువచ్చిన ఈవీ పాలసీ రెండేళ్ళపాటు అమలులో ఉంటుంది. కొత్త ఈవీ పాలసీ ద్వారా బైకులతో పాటు ఆటో, ట్రాన్స్‌పోర్టు బస్సులకు కూడా వంద శాతం పన్ను మినహాయింపు లభిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షా 70 వేల ఈవీలు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి.

కాలుష్య నియంత్రణ మండలి అధ్యయనం ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్‌లో 83, పటాన్‌చెరులో 82, సంగారెడ్డిలో 79 పాయింట్ల తీవ్రత నమోదైనట్లు తెలుస్తోంది. గ్రేటర్‌లో మూడువేల ఈవీసిటీ బస్సులు ప్రవేశపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 15ఏళ్లు దాటిన పాత వాహనాలకోసం స్క్రాప్‌ పాలసీ తీసుకువచ్చినట్టు తెలిపారు. త్వర లో రెండు స్ర్కాప్‌ కేంద్రాలు అందుబాటులోకి రానున్నట్లు వివరించారు. వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షలకు త్వరలో ఆటోమాటిక్‌ టెస్టింగ్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేయనున్నారు.

హైదరాబాద్‌లో పెరుగుతున్న ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్యకు అనుగుణంగా ఈవీ ఫాస్ట్‌ చార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులోకి తెచ్చేదిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గ్రేటర్‌జోన్‌ పరిధిలో 70 ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసింది. మరో 80 కేంద్రాలు ఏర్పాటుచేసే దిశగా ముందుకువెళ్తుంది. అందులో భాగంగా 20 ప్రాంతాల్లో స్థలాలు కూడా పరిశీలించింది. త్వరలో ఆయా ప్రాంతాల్లో ఈవీ ఫాస్ట్‌ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం 2026 డిసెంబరు 31 వరకు ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ పాలసీని కొనసాగిస్తునట్లు ప్రకటించడంతో ఈవీ వాహనాల కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు చదవండి .. 

కొడంగల్ నీ అయ్య జాగీరా.. పోయేకాలమే బిడ్డా..రేవంత్ పై రెచ్చిపోయిన జేజమ్మ

రియల్ ఎస్టేట్‌లో మరో మోసం.. నిండా ముంచిన సువర్ణ భూమి 

తెరుచుకున్న శబరిమల ఆలయం.. ఆన్ లైన్ లో దర్శనాల బుకింగ్స్

చెత్తకుప్పల్లో కులగణన సర్వే పత్రాలు.. ఆందోళనలో జనాలు

ప్రధాని మోడీకి తప్పిన గండం.. బీజేపీలో కలవరం

మహిళలకు అర్దరాత్రి పోలీసుల వేధింపులు..రేవంత్‌కు పుట్టగతులుండవ్!

కేటీఆర్.. నీ బొక్కలు ఇరుగుతయ్.. పీసీసీ చీఫ్ వార్నింగ్

కేటీఆర్ ఇంటి దగ్గర అర్ధరాత్రి టెన్షన్

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒరిజినల్ కాంగ్రెస్ నేత అర్ధనగ్న ప్రదర్శన

ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.

కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్

సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు

ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!

రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు

రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button