Homeతెలంగాణటార్గెట్ హరీష్ రావు!

టార్గెట్ హరీష్ రావు!

•బిఆర్ఎస్ లో ఉంటానని కెసిఆర్ పై ప్రమాణం చేయగలరా
•ఆయన ఎవరెవరిని కలుస్తున్నారో సమాచారం ఉంది
•తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:-
బిజెపితో గులాబీ పార్టీ చేతులు కలుపుతుందా? ఆ అనివార్య పరిస్థితిని కమలం పార్టీ సృష్టిస్తుందా? బిఆర్ఎస్ లో చీలిక ఖాయమా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం ఎంత? తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో దీని పైనే చర్చ నడుస్తోంది. నిన్ననే మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడిన రేవంత్ సంచలన విషయాలను బయటపెట్టారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఇవే చర్చకు దారితీస్తున్నాయి.

నిత్యం అనుమానాలే..
గులాబీ పార్టీ అగ్రనేత హరీష్ రావు వ్యవహార శైలిపై రేవంత్ రెడ్డి నిత్యం అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. గతంలో ఆ పార్టీ కీలక సమావేశంలో హరీష్ రావు కనిపించలేదు. ఆ సమయంలో ఆయన ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యారు. అప్పట్లో హరీష్ రావు పై వచ్చిన ఆరోపణలతో.. బిజెపితో బేరసారాలు ఆడేందుకే ఢిల్లీ బాట పట్టినట్లు రేవంత్ అనుమానాలు వ్యక్తం చేశారు. అప్పట్లో సీఎం వ్యాఖ్యలు గులాబీ పార్టీలో సైతం సెగలు రేపాయి. అందరూ అనుమానపు చూపులు చూసేలా చేశాయి. అయితే ఇప్పుడు మరోసారి అటువంటి వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. హరీష్ రావు ఎవరెవరితో బేరాలు చేస్తున్నారు? ఎవరెవరితో మాట్లాడుతున్నారు? అనే అంశాలను త్వరలో బయట పెడతానని సంకేతాలు పంపారు. ప్రస్తుతం ఇవి తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి.

రాజశేఖర్ రెడ్డి కి టచ్ లో వెళ్లలేదా..
సీఎం రేవంత్ మరో వ్యాఖ్య చేశారు. హరీష్ రావు బిఆర్ఎస్ లోనే ఉంటానని కెసిఆర్ పై ప్రమాణం చేయగలరా అంటూ సవాల్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే రాజశేఖర్ రెడ్డికి టచ్ లోకి వెళ్లిన చరిత్ర హరీష్ రావుది అని అభిప్రాయపడ్డారు. ఆయన పార్టీలో ఉండరు అని కూడా సంకేతాలు పంపారు. వచ్చే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేయడం ఖాయమని.. అందుకు తగ్గ సమాచారం తన వద్ద ఉందంటూ వెల్లడించారు రేవంత్ రెడ్డి. అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ కామెంట్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితిలో తీవ్ర గందరగోళం రేపుతున్నాయి.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు