
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసినటువంటి ట్వీట్ వైరల్ అవుతుంది. సీనియర్ ఎన్టీఆర్ ఒక కారణజన్ముడు, యుగ పురుషుడు, పేదల పెన్నిధి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈరోజు ఆయన 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నట్లు సీఎం ట్విట్ చేశారు. ఆనాటి రాజకీయాల్లో ఎన్టీఆర్ ప్రజలకు ఎంతలా సేవలు చేశారు అనేది మరోసారి గుర్తు చేసుకున్నారు. అలాగే తన సోషల్ మీడియా వేదికగా “సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలిగి ‘అన్న’ ఎన్టీఆర్ తరతరాలు చరిత్రను తిరగరాశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టారు అని.. కేవలం రెండు రూపాయలకు కిలో బియ్యం అలాగే సామాజిక భద్రత స్థాపించనులు తదితర పథకాలతో చరిత్ర గతిని పూర్తిగా మార్చారు అని సీఎం కొనియాడారు.
Read also : మాదాపూర్ లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
Read also : రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన





