
క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:- తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో శివ కార్తికేయనుకు ఎటువంటి గాయాలు కాకపోగా అతను ప్రయాణిస్తున్నటువంటి కారు స్వల్పంగా డ్యామేజ్ అయింది. చెన్నైలోని సెంట్రల్ కైలాశ్ ప్రాంతంలో మామూలుగా ప్రయాణిస్తున్నటువంటి అతని కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా పోలీసులు సమాచారం తెలిపారు. ఈ ఘటన జరిగిన కాసేపటికే ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకొని హీరో కార్తికేయన్ కారుకు జరిగిన ప్రమాద ఘటన గురించి విచారణ చేపట్టారు. వెంటనే కారులో ఉన్నటువంటి శివ కార్తికేయన్ బయటకు రావడంతో అతనికి ఎటువంటి గాయాలు కాలేదు అని.. ప్రస్తుతం అతను పూర్తిగా క్షేమంగా ఉన్నారు అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో శివకార్తికేయన్ అభిమానులు ఒక్కసారిగా ఆందోళనలో పడ్డారు. చివరికి ఎటువంటి చిన్న గాయం కాకపోవడంతో అభిమానులు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. కాగా శివ కార్తికేయన్ ఈ మధ్య నటిస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
Read also : అభివృద్ధికి అడ్డుపడిన వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు : సీఎం చంద్రబాబు
Read also : సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది?





