ఆంధ్ర ప్రదేశ్

ప్రకాశం జిల్లాలో ఘోర విషాదం.. ఒకే రోజు ముగ్గురు మృతి!..

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో వేరువేరు ఘటనలతో మంగళవారం ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని టంగుటూరు మండలం, వల్లూరు జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో…. బైక్పై వెళ్తున్న వర్ధన్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరోపక్క అదే మండలంలోని రైల్వే గేట్ వద్ద విశ్రాంత ఆర్మీ ఉద్యోగి శ్రీనివాస్ అనే వ్యక్తి రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక అర్ధవీడు మండలంలో మద్యం మత్తులో కన్న తండ్రి, తన కుమారుడిని కత్తితో పడడంతో తీవ్ర గాయాలు అవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది.

నిత్యం రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కూడా పలు కారణాలవల్ల పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. జాతీయ రహదారిపైన ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు వివరించారు. పోలీసు అధికారులు ఎన్నో రకాలుగా చార్జీలు విధిస్తున్న… హెల్మెంట్ లేకపోతే లైసెన్సును రద్దు చేస్తామని హెచ్చరించినా కూడా ప్రజలెవరు పట్టించుకోవడం లేదు. మద్యం మత్తుల వాహనాలు నడపకండి అని పోలీసులు ఎంత హెచ్చరించినా కూడా ఎవరు వినిపించుకోవడం లేదు. దీనివలన ఎక్కువగా రోడ్డు ప్రమాదాలలో చాలామంది మరణిస్తున్నారని పోలీస్ అధికారులు వెల్లడించారు. మరోవైపు ప్రజలు పోలీసు అధికారులదే తప్పు అని… ప్రజలు హెల్మెట్ లేకపోతే చార్జీలు విధించకుండా కఠిన ఆంక్షలు తీసుకోవాలని సామాన్య ప్రజలు పోలీసులకు సూచిస్తున్నారు. ఏది ఏమైనా కూడా నిత్యం ప్రతిరోజు కూడా జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తుండడంతో వాళ్ల కుటుంబ సభ్యుల రోదనలు అంతా ఇంతా కాదు అని… కాబట్టి ఎప్పటికప్పుడు అధికారులు కటిన ఆంక్షలు చేపడితే తప్ప వీళ్ళు మారరు అని అంటున్నారు.

 

ఇవి కూడా చదవండి .. 

  1. జేఈఈ విద్యార్థుల వివాదం – నిజం నిగ్గుతేలుస్తానన్న పవన్‌..!

  2. పవన్ కల్యాణ్ చిన్న కుమారుడి హెల్త్ కండీషన్ సీరియస్

  3. కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!

  4. టీడీపీ నెక్ట్స్‌ టార్గెట్‌ మాజీ మంత్రి రోజా – ఆడుదాం ఆంధ్రాలో అవినీతి పేరుతో కేసులు..?

  5. ఏపీలో 2029లో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది: ఉండవల్లి అరుణ్ కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button