
క్రైమ్ మిర్రర్, అమరావతి:- విజయవాడలో కృష్ణానది ఉధృతి చుట్టుపక్కల ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. వరద ప్రవాహం పెరగడంతో భవానీ ఐలాండ్ చుట్టూ నీరు చేరి పర్యాటక కార్యక్రమాలు నిలిచిపోయాయి. పర్యాటకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు బోటింగ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పటికే ఐలాండ్‌లో ఉన్న సందర్శకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.ఉపరితల ప్రాజెక్టుల నుంచి భారీగా నీరు వచ్చి చేరడంతో ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఫలితంగా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భవానీ ఐలాండ్ పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించి, వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Read also : మట్టి విగ్రహాలనే వాడదాం – పర్యావరణాన్ని కాపాడుదాం : కె ఎల్ఆ ర్
ప్రజలు అవసరం లేకుండా నది ఒడ్డునకు వెళ్లకూడదని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని హెచ్చరికలు జారీ చేశారు. వరద ఉధృతి మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని, అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కృష్ణానది వరద ఉధృతి విజయవాడలో మళ్లీ అప్రమత్త పరిస్థితులను సృష్టించింది. భవానీ ఐలాండ్‌ను చుట్టుముట్టిన వరదనీరు నగర వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈమధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు ప్రతిరోజు కూడా కురుస్తూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు కూడా ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ గేట్లను కూడా ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. కృష్ణానది, గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. కాబట్టి ఈ నదుల ప్రాంతాల ప్రజలు చాలా ప్రమోత్తంగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు.
Read also : మునుగోడు ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన యుగంధర్ రెడ్డి