తెలంగాణ

కాంగ్రెస్ మూర్ఖుల్లారా… గోదావరి ఎలా పారుతుందో కళ్ళు తెరిచి చూడండి : హరీష్ రావు

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్ట్ కూలిందని ప్రచారం చేసిన కాంగ్రెస్ మూర్ఖుల్లారా… ఒకసారి సిద్దిపేట తో పాటుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గలగల పారుతున్న గోదావరి జలాలను కళ్ళు తెరిచి చూడండి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఉన్నారు. సిద్దిపేట నియోజకవర్గం, చిన్నకోడూరు మండలంలోని విఠలాపూర్, రంగాయపల్లి గ్రామాల వద్ద రంగనాయక సాగర్ నుంచి కాలువలోకి నీటి విడుదలను బుధవారం ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ గాంధీభవన్లో కూర్చుని మాట్లాడడం కాదని.. గ్రామాల్లోకి వచ్చి పాడుతున్న గోదావరి జలాలను చూసి ప్రతి ఒక్కరు బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు.

Read More : బ్యాంకుకు వెళ్తున్నట్లు చెప్పి.. మహిళా అదృశ్యం

తెలంగాణకు కాలేశ్వరం ఒక వరం లాంటిదని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సిద్ధిపేట, యాదాద్రి, మెదక్ వంటి పలు జిల్లాలలో బంగారం లాంటి పంటలు పండుతున్నాయని అన్నారు. అసలు ఇప్పుడు కాలేశ్వరం లేకుంటే ఈ ప్రాంతమంతా ఎడారేనని… అంతేకాకుండా బోరు బావులు లేదా చిన్న చిన్న కాలువలలో చిక్కనీరు కూడా ఉండేది కాదని.. దీని ద్వారా ఒక్క పంట కూడా పండేది కాదని అన్నారు. కాలేశ్వరం కూలిందంటూ కాంగ్రెస్ నాయకులు దొంగ మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఖమ్మం జిల్లాలో పెద్దవాగు, నల్గొండ జిల్లాలో సుంకిశాల, పాలమూరులో వట్టెం పంపు హౌస్ ఇలా కాంగ్రెస్ వచ్చిన 15 నెలల్లోనే చాలా కూలిపోయాయని కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు.

Read More : సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్టు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button