
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- మన దేశంలో ఎవరైనా అవినీతి రాజకీయ నాయకులు ఉన్నారంటే అది కేవలం రాహుల్ గాంధీ నే అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ మరియు తేజస్వి యాదవ్ తప్పుడు వాగ్దానాలు చేస్తూ.. అబద్ధపు దుకాణాలు తెరిచారు అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా ఫైర్ అయ్యారు.నేడు ముజాఫర్ పూర్ ర్యాలీలో పాల్గొన్న నరేంద్ర మోడీ.. కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ… ఒకరు దేశంలోనే మోస్ట్ కరెక్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చారు… తేజస్వి యాదవ్ ను ఉద్దేశించి మరొకరు బీహార్ లోని అవినీతి కుటుంబం నుంచి వచ్చారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో వేలాది కోట్ల స్కామ్స్ చేసి ప్రస్తుతం బెయిల్ పై బయట తిరుగుతున్నారు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలు అధికారంలో ఉన్న చోటనే జంగిల్ రాజ్ వస్తుంది అని ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా ఈ అవినీతి బుద్ధిని మార్చుకోవాలని వారికి సూచించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీకి ప్రజలు మద్దతు పలుకుతున్నారు అని మరోసారి స్పష్టం చేశారు. ప్రజలకు అన్ని విధాలుగా మేలు చేయడమే అసలైన రాజకీయ నాయకుని లక్షణం అని పేర్కొన్నారు.
Read also : జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
Read also : ఆహా పట్టుదల అంటే ఇది.. మొదటి మ్యాచ్ లో ఘోర ఓటమి.. కట్ చేస్తే ఫైనల్ కు?





