ఆంధ్ర ప్రదేశ్

అభిమానుల ముసుగులో అసాంఘిక శక్తులా - జగన్‌ జర భద్రం..!

వైఎస్‌ జగన్‌కు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువ. ఆయన ఎక్కడికి వెళ్లినా అభిమానులు పోటెత్తుతారు. అభిమాన నేతను ఒక్కసారి కలవాలని… మనసారా పలకరించాలని… ఒక్కసారి చేయి కలపాలని తాపత్రయపడతారు. అది మంచిదే.. కానీ శృతిమించింతేనే ప్రమాదం. ఈమధ్య జగన్‌కు పోలీసుల భద్రత తగ్గించారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీంతో… అభిమానులను కంట్రోల్‌ చేసే వారు ఉండటం లేదు. మరోవైపు… అభిమానుల ముసుగులో అసాఘింక శక్తులు కుట్రలు చేస్తున్నాయని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. వారికి ఆ అనుమానం ఎందుకు వచ్చింది..? అందులో ఎంత నిజముంది..?

వైఎస్‌ జగన్‌ రాప్తాడులో పర్యటించారు. రామగిరి ఎంపీపీ ఎన్నికల సందర్భంగా.. టీడీపీ, వైసీపీ మధ్య జరిగిన గొడవల్లో పాపిరెడ్డిపల్లిలో ఉంటున్న లింగయ్య హత్యకు గురయ్యాడు. వైసీపీకి చెందిన లింగయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్‌ జగన్‌ వెళ్లారు. కుటుంబాన్ని పరామర్శించి.. వారికి ధైర్యం చెప్పారు. టీడీపీ తీరును ఎండగట్టారు. అయితే జగన్‌ పర్యటనలో భద్రతా లోపం కనిపించింది. పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లేందుకు జగన్‌ హెలిప్యాడ్‌ దగ్గరకు వచ్చారు. అప్పటికే అక్కడ గుమికూడిన జనం… ఒక్కసారిగా పోటెత్తారు. జగన్‌ మీద పడినంత పనిచేశారు. వారి ధాటికిహెలికాప్టర్‌ విండ్‌ షీల్డ్‌ కూడా పగిలిపోయింది. దీంతో.. జగన్‌ రోడ్డుమార్గంలో వెళ్లాల్సి వచ్చింది.

హెలికాప్టర్‌లో విండ్‌సీల్డ్‌ డ్యామేజ్‌పై వైసీపీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అభిమానులు అయితే అలా చేయరని… కొందరు దుండగులు, అసాంఘిక శక్తులు… అభిమానుల ముసుగులో ఇలా చేస్తున్నారని ఫైరయ్యారు. పథకం ప్రకారమే… ఇలా చేసుండొచ్చని అనుమానిస్తున్నారు. గతంలో వైఎస్‌ జగన్‌పై రెండు సార్లు దాడి జరిగిందని… గుర్తు చేస్తున్నారు.


Also Read : బుగ్గన, రోజాకు వైఎస్‌ జగన్‌ క్లాస్‌ – తప్పు రిపీట్‌ చేయొద్దంటూ వార్నింగ్‌..!


మరోవైపు… జగన్‌ రాప్తాడు పర్యటనలో భద్రతా లోపం లేదని అనంతపురం జిల్లా పోలీసులు చెప్తున్నారు. జనసమీకరణ చేయొద్దని వైసీపీ నేతలను కోరినా… వారు పట్టించుకోలేదన్నారు. జగన్‌ పర్యటనకు 1100 మంది పోలీసులతో భద్రత కల్పించామన్నారు. అయితే… వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి రెచ్చగొట్టేలా మాట్లాడటం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. కొంతమంది హెలికాప్టర్‌ డోర్‌ పట్టుకుని లాగడంతో… అది దెబ్బతిందని వివరణ ఇచ్చారు.

రాప్తాడు పర్యటనే కాదు.. ఇటీవల జగన్‌ ఏ పర్యటనలు చూసినా భద్రతా లోపం స్పష్టం కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. గుంటూరు మిర్చి యార్డ్‌ దగ్గర ప్రజలు ఒక్కసారి జగన్‌ను చుట్టుముట్టిన సంఘటనను కూడా గుర్తుచేస్తున్నారు. రాప్తాడు పర్యటనపై రెండు రోజుల ముందే సమాచారం ఇచ్చినా… పోలీసులు భద్రతా చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడికి కల్పించే భద్రత ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు…? కావాలనే… జగన్‌కు భద్రత కల్పించడంలేదని మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి .. 

  1. జేఈఈ విద్యార్థుల వివాదం – నిజం నిగ్గుతేలుస్తానన్న పవన్‌..!

  2. పవన్ కల్యాణ్ చిన్న కుమారుడి హెల్త్ కండీషన్ సీరియస్

  3. కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!

  4. టీడీపీ నెక్ట్స్‌ టార్గెట్‌ మాజీ మంత్రి రోజా – ఆడుదాం ఆంధ్రాలో అవినీతి పేరుతో కేసులు..?

  5. ఏపీలో 2029లో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది: ఉండవల్లి అరుణ్ కుమార్

Back to top button