తెలంగాణ

సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ ఇష్యూ.. నేషనల్ మీడియాకు హైదరాబాద్ సీపీ క్షమాపణలు

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ ఇష్యూలో మీడియాపై తాను చేసిన కామెంట్ల పట్ల హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ క్షమాపణలు చెప్పారు. నేషనల్‌ మీడియాను ఉద్దేశించి ఆదివారం తాను చేసిన కామెంట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. సంధ్య థియేటర్‌ ఘటనపై నేషనల్ మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు తాను సహనాన్ని కోల్పోయి అలా మాట్లాడాల్సి వచ్చిందని.. తాను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హీరో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌ వద్దకు వచ్చినప్పుడు అక్కడ అసలేం జరిగిందో తెలుపుతూ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదివారం ప్రెస్‌మీట్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. థియేటర్‌లో ఆరోజు ఏం జరిగిందో తెలుపుతూ కొన్ని వీడియోలను మీడియాకు విడుదల చేశారు. అయితే, ప్రెస్ మీట్ అనంతరం సీపీ సీవీ ఆనంద్ నేషనల్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతా.. సంచలన కామెంట్స్ చేశారు.

Also Read : అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ ను రద్దు చేయాలి : మల్లన్న

మీడియా అడిగిన ప్రశ్నలపై అసహనం వ్యక్తం చేసిన సీవీ ఆనంద్.. నేషనల్‌ మీడియా అల్లు అర్జున్‌కు మద్దతు ఇస్తుందంటూ కామెంట్స్ చేశారు. నేషనల్ మీడియా ఎప్పుడో అమ్ముడుపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సంధ్య థియేటర్ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని చెప్పారు. ప్రెస్‌మీట్‌లో జర్నలిస్టులు రెచ్చగొట్టే ప్రశ్నలు వేయడంతో తాను కాస్త సహనాన్ని కోల్పోయానని అన్నారు. తనను క్షమించాలని ట్వీట్ చేశారు. పరిస్థితులు ఎలా ఉన్నా సంయమనం పాటించాల్సి ఉంటుందని.. తాను చేసింది పొరపాటుగా భావిస్తున్నట్లు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను మనస్ఫూర్తిగా వెనక్కి తీసుకుంటున్నానని సీవీ ఆనంద్ ట్వీట్‌లో వెల్లడించారు. ఇక సంధ్య థియేటర్‌ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని సీపీ ఆదివారం నాటి ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామని చెప్పారు.

ఇవి కూడా చదవండి : 

  1. నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు…”ఫాస్టెస్ట్ చెక్ మేట్ సల్వార్”గా ఘనత
  2. శ్రీశైల దేవస్థానం సరి కొత్త నిబంధన… ఇక నుండి వాటిపై నిషేధం
  3. ప్రకాశం జిల్లాలో ఒకేరోజు రెండుసార్లు భూకంపం!.. ప్రతిక్షణం భయం?
  4. అల్లు అర్జున్ ఇంటిపై దాడి… నిందితులకు బెయిల్ మంజూరు

Back to top button