
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు సురక్షితంగా ఉంటే ముస్లిములు కూడా సురక్షితంగానే ఉంటారని అన్నారు. తమ రాష్ట్రంలో అన్ని మతాలవారు చాలా సేఫ్ గా ఉన్నారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. వందమంది హిందువుల కుటుంబాల మధ్య ఒక ముస్లిం కుటుంబం చాలా సురక్షితంగా ఉండగలదు అని అన్నారు. కానీ 100 ముస్లిం కుటుంబాల మధ్య 50 మంది హిందువులు అసలు సేఫ్ గా ఉండగలరా?… అని ప్రశ్నించారు. బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ దేశాలే ఈ సంఘటనలకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. తాజాగా ఆఫ్గానిస్థాన్ లో హిందువులు ఏమయ్యారు?.. అని ప్రశ్నించారు. కాబట్టి అక్కడ జరిగిన తప్పులు మన దేశంలో అసలు జరగకూడదు అని ఒక కార్యక్రమంలో స్పష్టం చేశారు.
కొడాలి నానికి గుండెపోటు – బైపాస్ చేయాలంటున్న వైద్యులు
అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం యోగి ఆదిత్యనాథ్ హిందువుల పై దాడులు జరుగుతే అసలు సహించడు. అయితే తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో ఇతర దేశాలలో హిందువులు ఎలా దెబ్బతింటున్నారో ఆలోచించాలని గుర్తు చేశారు. కాబట్టి అన్ని మతాలవారు కేవలం మన భారతదేశంలోనే చాలా భద్రతగా ఉండగలరు అని సమాధానం ఇచ్చారు. అత్యంత హిందువులు ఉన్నా దేశం మన భారతదేశం… కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కలిసి ఉండాలని కోరారు. మత విద్వేషాలను రెచ్చగొడితే మాత్రం అసలు సహించేది లేదని స్పష్టం చేశారు.