తెలంగాణరాజకీయం

అక్టోబర్‌లో జూబ్లీహిల్స్‌ బైపోల్‌ - కాంగ్రెస్‌ అభ్యర్థి విషయంలో కొత్త ట్విస్ట్‌..!

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి అక్టోబర్‌ చివరి వారంలో ఉపఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే… ఈ నియోజకవర్గంలో అభ్యర్థి కోసం కాంగ్రెస్‌ తీవ్ర కసరత్తు చేస్తోంది. సామాజిక సమీకరణాలను బేస్‌ చేసుకుని క్యాండిడేట్‌ను బరిలో దింపాలని చూస్తోంది. పేరు దాదాపు ఖరారైనా… చివరో ట్విస్ట్‌ ఉంటే అవకాశం ఉందన్నారు హస్తం పార్టీ శ్రేణులు. ఇంతకీ… జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరు…? కొత్త ట్విస్ట్‌ ఏంటి..?

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో… జూబ్లీహిల్స్‌ నియోజవర్గం ఖాళీ అయ్యింది. ఈ నియోజకవర్గంలో అక్టోబర్‌ ఎండింగ్‌లో ఉపఎన్నిక పెట్టబోతున్నారని సమాచారం. జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ సిట్టింగ్ స్థానాం. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలని గులాబీ పార్టీ ప్రయత్నిస్తోంది. మాగంటి గోపీనాథ్‌ కుటుంబసభ్యులను నిలబెట్టాలని చూస్తోంది. వారు అంగీకరించకపోతే.. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి వైపు మొగ్గుచూపు అవకాశం ఉంది. మరోవైపు.. ఎలాగైన జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగరేయాలని సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహరచన చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించార… వారికి ధీటైన అభ్యర్థిని నిలబెట్టాలని కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. మొత్తంగా.. మూడు పార్టీలో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టాయి.


Read Also : BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్.. కేటీఆర్ షాక్


గత ఎన్నికల్లో… మెజార్టీ సీట్లు సాధించి అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీకి…. గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేదు. దీంతో… గ్రేటర్‌ పాగా వేయడానికి జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఒక్కటే మార్గమని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. ఎలాగైనా జూబ్లీహిల్స్‌ బైపోల్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేను గెలిపించుకోవాలనుకుంటున్నారు. అందు కోసం గట్టి అభ్యర్థి కోసం కసరత్తు చేస్తున్నారు. ఆ దిశగా… ముగ్గురు మంత్రులు పొన్నం, తుమ్మల, వివేక్‌కు బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. అయితే.. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ఎక్కువ. ఎంఐఎం పార్టీ పోటీ చేస్తే… కాంగ్రెస్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే.. ఎంఐఎం పార్టీ పోటీ చేస్తుందా…? లేదా …? అన్నది తెలియాల్సి ఉంది.

ఇక.. జూబ్లీహిల్స్‌ బైపోల్‌ ఎన్నికల బరిలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు అజారుద్దీన్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈసారి విజయం సాధించి రాహుల్‌ గాంధీకి బహుమతిగా ఇస్తానని అంటున్నారు. అయితే… ఆయనకు టికెట్‌ ఇవ్వడంలేదని కొందరు కాంగ్రెస్‌ నేతలు చెప్తున్నారు. దీంతో… అజారుద్దీన్‌ బరిలో ఉంటారా.. ఉండరా.. అనేది క్లారిటీ లేదు.

Also Read : జమిలి దిశగా అడుగులు – 2029లో తెలంగాణ ఎన్నికలు – ఎవరికి నష్టం, ఎవరికి లాభం..!

Back to top button