ఆంధ్ర ప్రదేశ్
Trending

ఏపీ భవిష్యత్‌ జనసేన – ఈ కాన్సెప్ట్‌ వెనకున్న స్ట్రాటజీ ఏంటి…?

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు.. ఎన్నికలు అయిపోయినా హాట్‌హాట్‌గానే సాగుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో… జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. కేంద్రంలో ప్రధాని మోడీ దగ్గర ప్రస్తుతం సీఎం చంద్రబాబుకు ఎంత విలువ ఉందో… పవన్‌ కళ్యాణ్‌కు అంతకంటే ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఇటీవల అమిత్‌షా ఏపీ పర్యటనకు వచ్చిన సమయంలో కూడా.. పవన్‌ కళ్యాణ్‌ను పిలిచి.. తన పక్కన కుర్చీ వేయించి కూర్చోబెట్టుకున్నారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి పవన్‌ కళ్యాణ్‌కు వెళ్లగా.. ప్రధాని ఆయనతో సరదాగా మాట్లాడారు. అంటే… బీజేపీ అగ్రనేతలు… ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌పై స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. ఇందులో ఫ్యూచర్‌ రాజకీయ వ్యూహం కూడా ఉండి ఉండొచ్చు. ఏదేమైనా… ఇటు రాష్ట్రంలోనూ… అటు కేంద్రంలోనూ పవన్‌ కళ్యాణ్‌ ఇమేజ్‌ బాగానే ఉంది. పైగా… పవర్‌ స్టార్‌గా ఆయన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌కు అంతేఉండదు. ఇవన్నీ… పవన్‌ కళ్యాణ్‌కు రాజకీయంగా కలిసొచ్చే అంశాలు.

కర్ణాటకకు కొత్త సీఎం.. కాంగ్రెస్ లో ముసలం?

ఇవన్నీ ఎందుకంటే… జనసేన పార్టీ ఆవిర్భావ సభలకు పెట్టిన పేరు.. ఇప్పుడు అదే చర్చనీయాంశంగా మారింది. ఈనెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం ఉంది. ఆ రోజు పవన్‌ కళ్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ఈ సభ మాత్రమే కాదు.. జనసేన ఆవిర్భావ సభలన్నీ ‘ఏపీ భవిష్యత్‌ జనసేన’ అనే కాన్సెప్ట్‌తో నిర్వహిస్తున్నామని జనసేన నాయకుడు, పవన్‌ కళ్యాణ్‌ సన్నిహితుడు, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. ఇదిగో ఈ పేరు… రాజకీయ విశ్లేషకులను మరోసారి ఆలోచనలో పడేసింది. ప్రస్తుతం జనసేన… కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. అయితే.. ఏపీ భవిష్యత్‌ జనసేన అనే నినాదం పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటి..? వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీచేయాలని భావిస్తుందా…?

ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన భద్రత…

కూటమి పార్టీల్లో విభేదాలు ఉన్నా.. ప్రజల కోసం కలిసే ఉంటామని అసెంబ్లీ సమావేశాల్లో పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు. అంటే… ఈ సర్దుబాటు చివరి వరకు ఉంటుందా…? ఒకవేళా ఉన్నా… ఈ దఫా వరకే టీడీపీతో జనసేన కలిసి ఉంటుందా..? వచ్చే ఎన్నికల్లో ఎవరికి వారు విడివిడిగా పోటీచేస్తారా…? జనసేన సింగిల్‌ వెళ్లి.. విజయం సాధించాలని అనుకుంటుందా…? లేదా… జనసేన-బీజేపీ కలిసి పోటీచేస్తాయా…? ఏమో… వచ్చే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కానీ.. అందుకు పవన్‌ కళ్యాణ్‌.. ఇప్పటి నుంచే గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నట్టు మాత్రం తెలుస్తోంది.?

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు.. ఎన్నికలు అయిపోయినా హాట్‌హాట్‌గానే సాగుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో… జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. కేంద్రంలో ప్రధాని మోడీ దగ్గర ప్రస్తుతం సీఎం చంద్రబాబుకు ఎంత విలువ ఉందో… పవన్‌ కళ్యాణ్‌కు అంతకంటే ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఇటీవల అమిత్‌షా ఏపీ పర్యటనకు వచ్చిన సమయంలో కూడా.. పవన్‌ కళ్యాణ్‌ను పిలిచి.. తన పక్కన కుర్చీ వేయించి కూర్చోబెట్టుకున్నారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి పవన్‌ కళ్యాణ్‌కు వెళ్లగా.. ప్రధాని ఆయనతో సరదాగా మాట్లాడారు. అంటే… బీజేపీ అగ్రనేతలు… ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌పై స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. ఇందులో ఫ్యూచర్‌ రాజకీయ వ్యూహం కూడా ఉండి ఉండొచ్చు. ఏదేమైనా… ఇటు రాష్ట్రంలోనూ… అటు కేంద్రంలోనూ పవన్‌ కళ్యాణ్‌ ఇమేజ్‌ బాగానే ఉంది. పైగా… పవర్‌ స్టార్‌గా ఆయన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌కు అంతేఉండదు. ఇవన్నీ… పవన్‌ కళ్యాణ్‌కు రాజకీయంగా కలిసొచ్చే అంశాలు.

ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఎందుకు అంత ధైర్యం… అసలు అతను ఎవరు?

ఇవన్నీ ఎందుకంటే… జనసేన పార్టీ ఆవిర్భావ సభలకు పెట్టిన పేరు.. ఇప్పుడు అదే చర్చనీయాంశంగా మారింది. ఈనెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం ఉంది. ఆ రోజు పవన్‌ కళ్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ఈ సభ మాత్రమే కాదు.. జనసేన ఆవిర్భావ సభలన్నీ ‘ఏపీ భవిష్యత్‌ జనసేన’ అనే కాన్సెప్ట్‌తో నిర్వహిస్తున్నామని జనసేన నాయకుడు, పవన్‌ కళ్యాణ్‌ సన్నిహితుడు, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. ఇదిగో ఈ పేరు… రాజకీయ విశ్లేషకులను మరోసారి ఆలోచనలో పడేసింది. ప్రస్తుతం జనసేన… కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. అయితే.. ఏపీ భవిష్యత్‌ జనసేన అనే నినాదం పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటి..? వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీచేయాలని భావిస్తుందా…?

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో తలపడే జట్లు ఇవే!..

కూటమి పార్టీల్లో విభేదాలు ఉన్నా.. ప్రజల కోసం కలిసే ఉంటామని అసెంబ్లీ సమావేశాల్లో పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు. అంటే… ఈ సర్దుబాటు చివరి వరకు ఉంటుందా…? ఒకవేళా ఉన్నా… ఈ దఫా వరకే టీడీపీతో జనసేన కలిసి ఉంటుందా..? వచ్చే ఎన్నికల్లో ఎవరికి వారు విడివిడిగా పోటీచేస్తారా…? జనసేన సింగిల్‌ వెళ్లి.. విజయం సాధించాలని అనుకుంటుందా…? లేదా… జనసేన-బీజేపీ కలిసి పోటీచేస్తాయా…? ఏమో… వచ్చే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కానీ.. అందుకు పవన్‌ కళ్యాణ్‌.. ఇప్పటి నుంచే గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నట్టు మాత్రం తెలుస్తోంది.

Back to top button