ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో మరో దారుణం… భార్య, పిల్లలను చంపిన కిరాతకుడు

  • భార్య, ఇద్దరు పిల్లలను బావిలో తోసి హత్య

  • ముగ్గురిని చంపి భర్త గిరి ఆత్మహత్యాయత్నం

  • భర్త గిరి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు

  • పాకాల మండలం మద్దినాయినిపల్లెలో ఘటన

  • మృతులు హేమలత, తనుశ్రీ, తేజ

క్రైమ్‌ మిర్రర్‌, అమరావతి: ఏపీలో మరో దారుణ ఘటన జరిగింది. భార్య, ఇద్దరు పిల్లలను బావిలో తోసి చంపాడు ఓ కిరాతకుడు. ఆపై తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదఘటన తిరుపతి జిల్లా పాకాల మండలం మద్దినాయినిపల్లెలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే… తిరుపతి జిల్లా పాకాల మండలం మద్దినాయినిపల్లెకు చెందిన గిరి, అతని భార్య హేమలత, పిల్లలు తనుశ్రీ, తేజశ్రీతో కలిసి జీవిస్తున్నారు. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వారి బతుకుల్లో ఒక్కసారిగా జరిగిన ఊరంతటినీ ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఏమైందో తెలియదు కానీ… భార్య, పిల్లలను బావిలో తోసి చంపాడు గిరి. ఆపై తానూ ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు గిరిని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే, ఈ దారుణఘటన వెనుక కారణాలేంటనేది అంతు పట్టడం లేదు. కుటుంబ కలహాలా? మరేదైనా సమస్యలున్నాయా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గిరి ఆరోగ్యం కుదుటపడితే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 

Read Also: తన సినిమాలలో.. తనకు నచ్చిన మూవీ ఏదో చెప్పేసిన జక్కన్న!

Back to top button