
క్రైమ్ మిర్రర్, లైఫ్ స్టైల్ :- సాధారణంగా భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బాగా డబ్బు ఉన్న వ్యక్తులైతే డైట్ ను ఫాలో అవ్వడానికి ప్రత్యేకమైన డాక్టర్లను పక్కనే ఉంచుకొని వారు చెప్పినట్లుగా చేస్తుంటారు. కానీ మధ్యతరగతి కుటుంబాలు ఆరోగ్యం గురించి అంతగా ఆలోచించరు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలని నిత్యం వైద్య నిపుణులు చెబుతూనే ఉంటారు. ప్రస్తుత రోజుల్లో చాలామంది ఉత్సాహంగా కనిపించడం లేదు. అలాంటివారి కోసం నేడు మీ క్రైమ్ మిర్రర్ న్యూస్ ప్రత్యేకంగా ప్రతిరోజు ఉత్సాహంగా ఎలా ఉండాలి అనేది… ఏం చేయడం ద్వారా ఉత్సాహంగా ఉంటారనేది చెప్తాం.
Read also : తెలంగాణలో పోటీ చేయటం లేదు.. సీఎం కీలక నిర్ణయం!
ప్రతిరోజు రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే వైద్యులు కొన్ని సూచనలు పాటించాలని కోరారు. ఉదయం మీరు నిద్ర లేవగానే తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరగడంతోపాటుగా శక్తిని కూడా పెంచుతుంది. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల మానసిక స్థితి మెరుగవుతూ ఉంటుంది. అలాగే ఉదయం పూట నీరు త్రాగడం వల్ల శరీరం తక్షణమే హైడ్రేట్ అవ్వడంతో పాటుగా జీవక్రియ కూడా మెరుగవడం గమనిస్తారు. ఇక ప్రోటీన్లు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉన్నటువంటి ఈ సమతుల్య ఆల్పాహారం తీసుకోవడం వల్ల రోజంతా కూడా అలసిపోకుండా శక్తి అంతే ఉంటుంది. అలాగే కొద్దిసేపు పాటు సూర్యరశ్మిలో నిల్చుని ఉంటే చురుకుదనం కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి ప్రతి రోజు వ్యాయామం, నిద్ర లేవగానే కొంచెం నీరు, మంచి ఆహారం తీసుకోవడం వల్ల రోజంతా కూడా చాలా యాక్టివ్ గా, ఉత్సాహంగా ఉంటారు.
Read also : గెలవడం కోసం ఉచిత పథకాలు ప్రకటించొద్దు.. దీనివల్ల మనకే నష్టం : మాజీ ఉపరాష్ట్రపతి