
సంస్థాన్ నారాయణపూర్, అక్టోబర్ 02( క్రైమ్ మిర్రర్): లక్కీ డ్రాలు పెట్టినచో కఠిన చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ ఎస్పై జగన్ అన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పట్టణంలో గాని గ్రామాలలో గాని దసరా పండుగ సందర్భంగా కొంతమంది వ్యక్తులు లాటరీ పేరుతో ప్రజలను మోసం చేస్తూ అక్రమ పద్ధతిలో డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో 100,200 99,51 రూపాయలు కొట్టు మేక పట్టు, గిఫ్ట్ ను పట్టుఅని మభ్యపెట్టి అక్రమ దందా చేస్తున్నారు. ఇట్టి లాటరీ సిస్టం తెలంగాణ గవర్నమెంట్ చేత నిషేధించబడింది . ఈ లాటరీ స్కీములను ఎవరైనా నిర్వహించినట్లయితే వారి పైన చట్టపరమైన చర్య తీసుకోబడును