
క్రైమ్ మిర్రర్, అమీర్ పేట్ : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ విస్తరణకు సంబంధించిన ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులు నేడు హెచ్ఎండీఏ కార్యాలయం ముందు మహా ధర్నాకు దిగారు. ప్రభుత్వం మార్చిన రోడ్డు అలైన్‌మెంట్ కారణంగా తమ భూములు అన్యాయంగా స్వాధీనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతులు పెద్ద పెద్ద భూస్వాముల భూములను వదిలేసి, పేద రైతుల భూములపైనే ప్రభుత్వం దృష్టి సారించిందని ఆరోపిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మా తరతరాలుగా సాగుచేసుకుంటున్న పొలాలను రోడ్డు పేరుతో లాక్కోవడం అన్యాయం. ప్రభుత్వం పునరాలోచించాలని అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహా ధర్నాలో భారీ సంఖ్యలో రైతులు, భూ నిర్వాసిత కుటుంబాలు పాల్గొంటున్నారు.
హెచ్ఎండీఏ కార్యాలయానికి చేరుకునే మార్గంలో పోలీసులు భారీగా మోహరించారు. హైదరాబాద్ వైపు వస్తున్న రైతులను కొన్ని చోట్ల పోలీసులు అడ్డుకుని, ఎక్కడికక్కడ అరెస్టులు చేపడుతున్నట్లు సమాచారం… రైతులు మాత్రం తమ ఉద్యమాన్ని వెనక్కి తిప్పుకోమని స్పష్టంచేస్తున్నారు. మా హక్కుల కోసం చివరి వరకు పోరాడతాం అంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు హెచ్ఎండీఏ పరిసర ప్రాంతాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు.
Read also : కౌంటర్ ఇవ్వబోయి ఎక్స్ ట్రాలు మాట్లాడిన పాక్ రక్షణ మంత్రి?
Read also : ట్రంప్ సూపర్ డాన్స్.. ఫైర్ అవుతున్న నెటిజన్స్?