తెలంగాణ

చండూరు రోడ్డు వెడల్పు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

చండూరు, క్రైమ్ మిర్రర్:- చండూరు మున్సిపాలిటీలో నిర్మిస్తున్న రోడ్డు వెడల్పు పనులను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం సాయంత్రం పరిశీలించి కాంట్రాక్టర్ కు పలు సూచనలు చేశారు. రోడ్డు వెడల్ పనుల్లో భాగంగా విద్యుత్ స్తంభాలను షిఫ్ట్ చేసి త్వరితగతన పనులను పూర్తి చేయాలన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని చండూరు పట్టణ ప్రధాన రహదారి కి వివిధ గ్రామాల నుండి కనెక్ట్ అయ్యే రోడ్లను చండూరు మున్సిపాలిటీ పరిధి వరకు 60 ఫీట్లు వెడల్పు రోడ్డు గా మార్చాలని ఆలోచన చేశారు. దానికి సంబంధించి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కాంట్రాక్టర్ ని ఆదేశించారు..

చండూరు పట్టణ సెంటర్లో వాణిజ్య భవనాల వద్ద రోడ్డు వెడల్పు ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందో పరిశీలించారు. చండూరు బస్టాండ్ నుండి కనగల్ వైపు శివారు ప్రాంతం వరకు చేపట్టిన రోడ్డు డివైడర్ పనులను పరిశీలించి పలుమార్పులను సూచించారు. రోడ్డు డివైడర్ మధ్యలో పచ్చగడ్డి లాన్ తో పాటు అందమైన చెట్లను పెంచేలా నిర్మాణం జరగాలన్నారు…. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రోడ్డు వెడల్పు పనులతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను కల్పించి చండూరు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు.

ఇవి కూడా చదవండి

  1. గొల్లపల్లిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
  2. గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్ పై గందరగోళం!.. క్లారిటీ ఇచ్చిన APPSC
  3. మాఅమ్మ ఆరోగ్యం గురించి అసత్య ప్రచారాలు చేయకండి: చిరంజీవి
Back to top button