
నారాయణపేట,క్రైమ్ మిర్రర్:- ప్రజలకు బాధ్యతాయుతంగా సేవలందిస్తే సమాజంలో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. కోస్గి పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ గా విధులు నిర్వర్తిస్తూన్న ఆంజనేయులు ఎస్సైగా పదోన్నతి పొందడం జరిగింది. బుధవారం రోజు జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ చేతుల మీదుగా పదోన్నతి పొందిన ఆంజనేయులుకు ఎస్సైగా రెండు స్టార్ లను అలంకరించి అభినందనలు తెలియజేసారు. అనంతరం ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ పదోన్నతి ఉత్సాహంతో పాటు మరింత బాధ్యత పెంచుతుందని అలాగే పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు పోలీసుల పట్ల భరోసా, నమ్మకాన్ని కలిగించడంతో పాటు, నిరుపేద ప్రజలకు పోలీస్ అధికారులు అండగా నిలవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎస్సైగా పదోన్నతి పొందిన ఆంజనేయులుని కోస్గి పోలీస్ స్టేషన్ ఎస్సై 2 గా బదిలీ చేయడం జరిగిందని డిఎస్పి లింగయ్య తెలిపారు.
Read also : సరదాగా అనంతపురానికి ఫ్రీ బస్సులో వెళుతున్న మహిళ.. రీల్ వైరల్!
Read also తెలంగాణ రైతులకు ఊరట.. యూరియా కేటాయింపు!