Maoists: మావోయిస్టులకు భారీ షాక్.. లొంగిపోయిన కీలక నేతలు!

మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అగ్రనేత బర్సె దేవాతో పాటు 15 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది.

Big Shock  to Maoist Party: గత కొద్ది కాలంగా మావోయిస్టుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు అగ్రనేతలు ఎన్ కౌంటర్ కాగా, చాలా మంది కీలక నేతలు లొంగిపోయారు. తాజాగా మరో అగ్రనేత బర్సెదేవా తనతో పాటు 15మంది మావోయిస్టులతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బర్సెదేవా తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నప్పటికీ, ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఒకటి రెండు రోజుల్లో పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

హిడ్మాతో కలిసి పని చేసిన బర్సెదేవా

బర్సెదేవా.. ఇటీవల పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన  మావోయిస్టు అగ్ర నేత హిడ్మాతో కలిసి సుమారు 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పని చేసినట్లు తెలుస్తోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో కమాండెంట్‌గా పనిచేసిన బర్సెదేవా, అనేక కీలక మావోయిస్టు ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి.

బర్సెదేవాపై రూ.50 లక్షల రివార్డు

బర్సెదేవాపై ప్రస్తుతం రూ.50 లక్షల రివార్డు ఉంది. సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన పలు దాడుల్లో బర్సెదేవా  కీలక పాత్ర ఉన్నట్లు ఛత్తీస్‌గడ్ పోలీసులు వెల్లడించారు. ఇటీవల భద్రతా బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’లో భాగంగా వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. కఠిన చర్యల కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బర్సెదేవా లొంగిపోయినట్లు తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు, దళం బలహీనపడుతున్నడానికి నిదర్శనమని భద్రతా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు మార్చి 31 వరకు మావోయిస్ట్ ముక్త్ భారత్ కాబోతున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.

Back to top button