
రామకృష్ణాపూర్,(క్రైమ్ మిర్రర్):-పండుగ వేళ ప్రమాదకరమైన “చైనా మాంజా” విక్రయాలపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. పట్టణంలోని పలు దుకాణాల్లో మంగళవారం ఎస్సై భూమేష్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజాను విక్రయించరాదని దుకాణ యజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బీ-జోన్ సెంటర్, రాజీవ్ చౌక్ ప్రాంతాల్లోని దుకాణదారులతో మాట్లాడిన ఎస్సై, గతంలో చైనా మాంజా వల్ల జరిగిన ప్రమాదాలను గుర్తు చేశారు. పతంగులు ఎగురవేసే సమయంలో ఈ దారం వల్ల వాహనదారులు, ప్రజలు తీవ్రంగా గాయపడటమే కాకుండా, ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయని వివరించారు.
ఎవరైనా నిబంధనలు అతిక్రమించి నిషేధిత దారాలను విక్రయిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలోని యువకులు, పిల్లలు పతంగులు ఎగురవేసేటప్పుడు కేవలం సాధారణ దారాలనే వాడాలని ఎస్సై సూచించారు. “పండుగను సుఖసంతోషాల మధ్య, సురక్షితంగా జరుపుకోవాలి. ఎవరూ కూడా చైనా మాంజా వాడి ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేయకూడదు” అని కోరారు.ఈ తనిఖీల్లో ఎస్సై భూమేష్‌తో పాటు హెడ్ కానిస్టేబుళ్లు జంగు, ఓంకార్, పాల్గొన్నారు.
Read also : ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎంపీ వంశీకృష్ణ
Read also : చైనీస్ మాంజా ప్రజల ప్రాణాలకే కాదు పర్యావరణానికి కూడా ముప్పే : సజ్జనార్





