
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్ :- ప్రస్తుతం మన భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్ దేశాన్ని రెండు రోజుల క్రితం హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే ప్రపంచ పఠం మీద పాకిస్తాన్ దేశాన్ని లేకుండా చేస్తామని భారత ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ ను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి అసీం ఖవాజా భారతదేశంపై స్థాయికి మించి మాట్లాడారు. ఫ్యూచర్లో మా పాకిస్తాన్ దేశంపై సైనిక దాడి జరిగితే మాత్రం తమ సొంత యుద్ధ విమానాల కిందనే భారతదేశం సమాధి అవుతుందని కామెంట్ చేశారు. అయితే పాకిస్తాన్ రక్షణ మంత్రి అసిమ్ ఖావాజ చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఆసిమ్ ఖవాజా చేసినటువంటి ఈ కామెంట్ తర్వాత చాలామంది చాలా రకాలుగా కౌంటర్స్ రూపంలో కామెంట్లు చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని పోషిస్తే మాత్రం పాకిస్తాన్ దేశాన్ని లేకుండా చేస్తామని భారత ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ దేశాన్ని హెచ్చరించిన తర్వాత పాక్ రక్షణ మంత్రి ఇందుకు కౌంటర్ ఇచ్చే క్రమంలో చాలా ఎక్సట్రాలు మాట్లాడారు.
ఎవరి బలం ఎంతో ప్రతి ఒక్కరికి తెలుసులే అని… ఇండియన్ నెటిజన్స్ తిరిగి పాకిస్తాన్ రక్షణ మంత్రి అసిం ఖవాజాకు కౌంటర్లు వేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ 1.0 లో చూపిన సహనం ఆపరేషన్ సిందూర్ 2.0 లో ప్రదర్శించామని మన భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తే మాత్రం ఊరుకునేది లేదని… ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలాసార్లు చోటుచేసుకున్నాయని… ఇంకోసారి ఉగ్రవాదుల ఘటనలు వెలుగు చూస్తే పాకిస్తాన్ దేశాన్ని లేకుండా చేస్తామని భారత్ హెచ్చరించింది. కాగా పహల్గాం ఉగ్రదాడి జరిగిన తరువాత పాకిస్తాన్ దేశంపై భారత్ తీవ్ర ఆగ్రహం మీద ఉంది. శత్రు దేశంపై ఇంకా కోపం పెరుగుతూనే వస్తుంది. ఇలాంటి నేపథ్యంలోనే ఇరుదేశాల ప్రజల మధ్య సోషల్ మీడియాలోనూ మాటల యుద్ధం జరుగుతుంది.
Read also : ట్రంప్ సూపర్ డాన్స్.. ఫైర్ అవుతున్న నెటిజన్స్?
Read also : తెలంగాణలో వైరల్ అవుతున్న మైనర్ల ట్రాప్ హౌస్ పార్టీ.. చివరికి ఏమైందంటే?