
ఇదిగో జమిలీ… అదిగో జమిలీ అన్నారు. కానీ… ఈ మధ్యన ఆ ఊసే లేదు. ఎందుకని… ? జమిలీ ఎన్నికల నిర్వహణపై కేంద్రం వెనక్కి తగ్గిందా…? లేదా… ప్రత్యామ్నాయం ఆలోచిస్తుందా…? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జమిలీ కుదరకపోతే… మినీ జమిలీ నిర్వహించాలన్న ప్లాన్‌లో ఉందట కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. మరి… మినీ జమిలీ వర్కౌట్ అవుతుందా..?
జమిలీ.. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగే ప్రక్రియ. జమిలీ ఎన్నికలు నిర్వహించాలన్నది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లక్ష్యం. దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రజాధనం వృధా కాకుండా ఉంటుందనే వాదన ఉంది. అంతేకాదు.. తరచూ ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికలపైనే నాయకులు దృష్టిపెట్టాల్సి వస్తోందని.. పరిపాలన, ప్రజాసంక్షేమం, అభివృద్ధికి ఎక్కువ సమయం ఉండటంలేదనే వాదన కూడా ఉంది. దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే… ఆ తర్వాత ఐదేళ్లు పాలనపైనే ఫోకస్ పెట్టొచ్చనే అభిప్రాయం ఉంది బీజేపీ. అందుకోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో కమిటీ వేసింది. జమిలీ ఎన్నికల నిర్వహణపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయించింది. నివేదిక కూడా తెప్పించుకుంది. అయితే.. జమిలీ అంత ఈజీ కాదు. రాజ్యాంగ సవరణ చేయాలి. అందుకు పార్లమెంట్లో 2/3 మెజార్టీ కావాలి. దీనికి NDA సర్కార్ బలం సరిపోదు. ప్రతిపక్ష పార్టీలు కూడా సహకరించాలని. అంటే… అది ఇప్పట్లో తేలే అంశం కాదు. అందుకే బీజేపీ ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నట్టు సమచారం. ఆ ప్రత్యామ్నాయమే మినీ జమిలీ.
Also Read : ఘోర రోడ్డు ప్రమాదం.. ఐపీఎస్ అధికారి దుర్మరణం!
కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యూహాత్మకంగా మినీ జమిలీపైవు అడుగులు వేస్తున్నట్టు సమాచారం. 2027లో మినీ జమిలీ ఎన్నికలు నిర్వహించాలన్నది బీజేపీ ప్లాన్‌గా తెలుస్తోంది. 2027లోనే ఎందుకంటే…? 2027లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. యూపీలో విజయం సాధిస్తే ఒకే.. లేదంటే… ఈ పరిస్థితి బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో ఒకవేళ బీజేపీ ఓడిపోతే… ఈ ప్రభావం 2029 పార్లమెంట్ ఎన్నికలపై పడుతుంది. అలా జరగకుండా ఉండేందుకు బీజేపీ మినీ జమిలీకి వెళ్లాలని యోచిస్తోందట. ఉత్తరప్రదేశ్‌తోపాటు పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తే… బాగుంటుందన్న ఆలోచనలో ఉందట కాషాయ పార్టీ. అంతేకాదు.. ఆ ఎన్నికల సమయానికి ఆరు నెలల ముందు.. ఆరు నెలల తర్వాత అసెంబ్లీ కాలపరిమితి ముగిసే రాష్ట్రాలకు కూడా అప్పుడే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. అలా చేస్తే.. మినీ జమిలీ నిర్వహించి.. జమిలీపై ప్రజల్లో ఒక అవగాహన తేవాలన్నది కూడా కమలనాథుల ప్లాన్. ఇదే వర్కౌట్ అయితే… 2027లోనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చే అకాశం ఉంది.