
ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్:- యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ మరియు జిల్లా ట్రాన్స్పోర్ట్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట ఆర్. టి. సి. డిపోలోని బస్సు డ్రైవర్లు, ఇతరులకు రహదారి భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమములో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రణీత్ రెడ్డి, న్యాయ సహాయ న్యాయవాదులు సాయి శ్రీనివాస్, నాగరాజులు,డిపో మేనేజర్ మురళీ కృష్ణలు డ్రైవర్లకు మోటార్ వెహికల్ చట్టాలు, నిబంధనలు,ప్రమాద భీమా నష్ట పరిహారం అంశాలపై అవగాహన పరచి రోడ్డు భద్రత నియమాలు తప్పని సరిగా పాటించాలని ప్రయాణికులను తమ గమ్యాలకు క్షేమంగా చేర్చే బాధ్యత తమపై ఉన్నదని తెలిపి,రహదారి భద్రత ప్రమాణాన్ని అందరితో చేయించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట పాత,కొత్త బస్టాండుల దగ్గర,కూడలిలో ద్విచక్ర వాహనదారులకు అవగాహన కరపత్రాలు అందించి, ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పి. ఎల్. వి కె శ్రీశైలం, ట్రాఫిక్ కానిస్టేబుల్స్, వాహన చోదకులు పాల్గొన్నారు.
Read also : Vedanta: 75 శాతం సంపాదన దానం చేస్తా.. వేదాంతా అధినేత అనిల్ కీలక ప్రకటన!
Read also : New Road Safety Push: రోడ్డు ప్రమాదాల నివారణకు వీ2వీ టెక్నాలజీ, కేంద్రం కీలక నిర్ణయం!





