define( 'WP_CACHE', true ); // Added by Hummingbird ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం, నలుగురు దుర్మరణం
క్రైమ్

ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం, నలుగురు దుర్మరణం

  • ఆగివున్న లారీని వెనుకనుంచి ఢీకొన్న కారు

  • నలుగురు స్పాట్‌ డెడ్‌, మరొకరికి తీవ్రగాయాలు

  • ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రమాదం

క్రైమ్‌ మిర్రర్‌, హైదరాబాద్: ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఔటర్‌ రింగ్ రోడ్డుపై ఆగివున్న లారీని కారు వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు స్పాట్‌లోనే చనిపోయారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మృతులు గగులోత్‌ జనార్థన్‌ (45), మాలోత్‌ చందులాల్‌ (29), కావలి బాలరాజు (40), భాస్కర్‌రావు (39)గా గుర్తించారు. మాలోతు చందుది వరంగల్‌ జిల్లా పాకాల కొత్తగూడెం మాసంపల్లి తండాగా గుర్తించారు. కావలి బాలరాజుది మెయినాబాద్‌ మండలం ఎల్కలపల్లి.

ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో నలుగురి మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయాయి. పోలీసులు మూడుగంటల పాటు శ్రమించి మృతదేహాలను వెలికితీశారు. తెల్లవారుజామున మూడుగంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. యాదగిరిగుట్టకు వెళ్లి వస్తుండగా తిరుగుప్రయాణంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Back to top button