తెలంగాణ

నల్గొండ మంత్రులు హెలికాప్టర్ మంత్రులు.. దామోదర సీరియస్ కామెంట్స్

తెలంగాణ కాంగ్రెస్ లో కల్లోల పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్గపోరు ముదిరిపోతోంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ వర్గ విభేదాలు పెరిగిపోయాయి. సొంత పార్టీ లీడర్ల మధ్యే వార్ సాగుతోంది. కమీషన్ల కోసం కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం కాంగ్రెస్ లో కనిపిస్తోంది. తాజాగా మంత్రివర్గంలోనూ కోల్డ్ వార్ సాగుతుందని తెలుస్తోంది. కొందరు మంత్రులు ఓపెన్ గానే సహచర మంత్రుల తీరుపై ఫైరవుతున్నారు. తాజాగా ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేసిన కామెంట్లు గాంధీభవన్ లో ప్రకంపనలు రేపుతున్నాయి.


Also Read : రేవంత్ నాఇంటికి వచ్చి పిలిస్తేనే కాంగ్రెస్ లో చేరా.. వివేక్ సంచలనం 


ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన మంత్రులపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి దామోదర రాజనర్సింహ. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల హెలికాప్టర్ పాలనపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఖమ్మం, నల్గొండ మంత్రుల రాజ్యం నడుస్తుందని అన్నారు. హెలికాప్టర్ ఎక్కాలన్నా వాళ్ళే, వాటిని కొనాలన్నా వాళ్ళే అంటూ దామోదర ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందరికంటే హెలికాప్టర్ తక్కువ వాడింది తానేనని తెలిపారు.


Also Read : జగన్ భార్యపై దారుణమైన కామెంట్స్ చేసిన కిరణ్… చివరికి అరెస్ట్?


ఆ రెండు జిల్లాల మంత్రులు హైదరాబాద్ రావడానికి సెక్రటేరియట్ పై ఒక హెలిపాడ్ పెట్టాల్సి వస్తుందేమోనని దామోదర సెటైర్లు వేశారు. రాబోయే రోజుల్లో నాలుగు దిక్కుల కోసం నాలుగు హెలికాప్టర్లు కొనాలంటూ చిట్ చాట్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ కామెంట్ చేశారు. నల్గొండ, ఖమ్మం జిల్లాల మంత్రులపై దామోదర రాజనర్సింహ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పార్టీ నేతల్లో చాలామందికి ఇదే అభిప్రాయం ఉందని.. దామోదర మాత్రమే బయటికి వచ్చారని చెబుతున్నారు. దక్షిణ తెలంగాణ మంత్రుల తీరుపై ఉత్తర తెలంగాణ మంత్రులు సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. కమీషన్లు, భూకబ్జాల్లోనూ అంతా ఆ రెండు జిల్లాల మంత్రులే దోచుకుంటున్నారనే టాక్ గాంధీభవన్ లో సాగుతోందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి .. 

  1. తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్‌ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.

  2. మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని? 

  3. కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!

  4. కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?

  5. ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button