తెలంగాణ

రేవంత్, కేటీఆర్ షేక్ హ్యాండ్స్.. బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం!

జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదన కాకరేపుతోంది. దీన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ చెన్నైలో అఖిలపక్ష సమావేశం తలపెట్టారు. ఈ భేటీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌ పాల్గొంటున్నారు. ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధిగా మహేశ్‌ గౌడ్‌ హాజరవుతున్నారు. స్టాలిన్‌ ఆహ్వానం మేరకు బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సైతం ఈ సమావేశంలో పాల్గొంటుండటం ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో బద్ధశత్రువుల్లా వ్యవహరిస్తున్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు. ఈ అంశంపై కలిసి పోరాడేందుకు సిద్ధమయ్యాయి. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అన్నది సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టేనంటూ ప్రకటించిన స్టాలిన్‌.. ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా పోరాడేందుకు జేఏసీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. చెన్నైలో జరిగే అఖిలపక్ష సమావేశంలో జేఏసీ ప్రతిపాదనను తెరపైకి తేనున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్, కేటీఆర్ ఏం మాట్లాడుతారన్నది ఆసక్తిగా మారింది. ఇద్దరు కలుసుకుంటారా.. మాట్లాడుకుంటారా.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రకటిస్తారా అన్న చర్చలు సాగుతున్నాయి.

Read More : సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా 

మరోవైపు అఖిలపక్ష భేటీ ముగిసిన తర్వాత కేటీఆర్‌ మాజీ గవర్నర్‌ నరసింహన్‌ ఇంటికి వెళ్లనున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి.నరసింహన్ గవర్నర్ గా చేసిన సమయంలో కేసీఆర్ కుటుంబంతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నరసింహన్ హైదరాబాద్ నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా కేసీఆర్ ఫ్యామిలీతో టచ్ లో ఉన్నారు. కేసీఆర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సమయంలోనూ చెన్నై నుంచి వచ్చి పరామర్శించి వెళ్లారు నరసింహన్.

ఇవి కూడా చదవండి …

  1. జగన్‌కు ఏడుగురు ఎమ్మెల్యేల వెన్నుపోటు – రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారుగా…!

  2. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం!..

  3. కాలం తెచ్చిన కరువు కాదు… పక్కా కాంగ్రెస్ తెచ్చిన కరువే.

  4. టీడీపీని తొక్కుకుంటూ పైకొస్తున్న జనసేన – తిరుపతి చంద్రబాబు పర్యటనే సాక్ష్యం

  5. 2029లో టీడీపీ అధికారంలో ఉండటం కష్టమేనా – చరిత్ర ఏం చెప్తోంది..?

Back to top button