
క్రైమ్ మిర్రర్,వలిగొండ:- యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అవరణలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడును.శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా తేది.11.01.2026 ఆదివారం రోజు కుడారై ఉత్సవంలో భాగంగా స్వామి వారికి 108 పాత్రలలో పాయసాన్నం తయారుచేసి స్వామి వారికి నైవేద్యంగా సమర్పిస్తారు. తేది.12.01.2026 సోమవా సోమవారం రోజు స్వామి వారికి 108 కలశాలతో అభిషేకం తేది. 14.01.2026 బుధవారం రోజు ఉదయం 10.30 నిమిషాలకు శ్రీ గోదా రంగనాథ స్వామి స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా బ్రాహ్మణులచే వేద మంత్రోచరణాల నడుమ స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుపబడునని ఆలయకార్యనిర్వహణాధికారి సల్వాద్రి మోహన్ బాబు పత్రిక ప్రకటనలో తెలిపారు.శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ ఈవో తెలిపారు.ఈ కార్యక్రమంలో అర్చకులు అలయ సిబ్బంది భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Read also : రహదారి భద్రతపై యాదగిరిగుట్ట డిపోలో అవగాహన సదస్సు
Read also ::రహదారి భద్రతపై యాదగిరిగుట్ట డిపోలో అవగాహన సదస్సు





